Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా ఈ ఎన్ టి వైద్య శిబిరం వింజమూరు, అమరావతి జ్యోతి :ఈనెల 10వ తేదీ ఉదయం 10గంటలకు వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు ఎదురుగా మన కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ కేంద్ర కార్యాలయం నందు చెవి ముక్కు గొంతు సమస్యలతో బాధపడుతున్నవారి కోసం అనుభవజ్ఞులైన డాక్టర్లచే వైద్యసేవలందించుటకు మెగా ఈ ఎన్ టి మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడమైనది. మన నియోజకవర్గం నలు మూలలు నుండి చెవి ముక్కు గొంతు వైద్యం నిమిత్తం మెడికల్ క్యాంపుకు విచ్చేయువారికి బోజన సదుపాయములతో పాటు రవాణా ఖర్చులను చెల్లించి వినికిడి సమస్యలు ఉన్నవారికి ఉచితంగా చెవిటి మిషన్లను సైతం అందించడం జరుగుతుందని తెలియచేసారు. చెవి ముక్కు గొంతు వైద్యనిపుణులు మాత్రమే మెడికల్ క్యాంపు నందు ఉంటున్నందున చెవి ముక్కు గొంతు సమస్యలున్నవారు మాత్రమే రాగలరని తెలియచేయడమైనది.
Admin
Amaravathi Jyothi