Monday, 20 April 2026 05:25:22 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

కౌంటింగ్ ఏజెంట్లకు సూచనలు ఇచ్చిన ఇంటూరి నాగేశ్వరరావు

Date : 02 June 2024 08:32 PM Views : 878

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు,: ఈనెల 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి... కౌంటింగ్ ఏజెంట్లకు, కందుకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం శిక్షణ నిర్వహించారు. మహాకూటమి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి *ఇంటూరి నాగేశ్వరరావు* , ఏజెంట్లకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కౌంటింగ్ జరిగేటప్పుడు ప్రతి ఏజెంట్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. బూత్ ల వారీగా EVM మిషన్ నెంబర్లను, అలాగే పోలైన ఓట్లను తప్పకుండా సరిచూసుకోవాలన్నారు. టెక్నికల్ గా ఎలాంటి అనుమానం వచ్చినా.. వెంటనే చీఫ్ ఏజెంట్ లేదా లీగల్ టీం కు తెలియజేయాలన్నారు. వైసిపి ఏజెంట్లు కావాలనే రెచ్చగొట్టేలా వ్యవహరించే అవకాశం ఉందని, అలాంటి సందర్భాల్లో సంయమనం పాటించడంతోపాటు అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసేంతవరకు అక్కడే ఉండాలని, ప్రతి ఒక్కరూ కౌంటింగ్ నియమాలు తెలుసుకొని వ్యవహరించాలని నాగేశ్వరరావు కోరారు. ఈ సందర్భంగా లీగల్ కమిటీ సభ్యులు చిడిపోతు హరికృష్ణ, బెజవాడ కృష్ణయ్య, వలేటి శ్రీధర్ నాయుడు ఏజెంట్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నె రోశయ్య, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, పార్టీ సీనియర్ నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు, ఉన్నం వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :