Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఎమ్మెల్యే మహీధర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన చంద్రమౌళి. వలేటి వారిపాలెం అమరావతి జ్యోతి :నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జనరల్ సెక్రెటరీగా నియమితులైన వలేటివారి పాలెం మండలం బడేవారి పాలెం గ్రామానికి చెందిన నల మోతు చంద్రమౌళి తన నియామకానికి సహకరించిన కందుకూరు నియోజకవర్గం శాసనసభ్యులు మానుగుంట మహిధర్ రెడ్డిని కలసి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వలేటివారిపాలెం మండలం వైయస్సార్ సీపీ నాయకులు ఇంటూరి హరిబాబు. గోవిందయ్య, బాబురావు తదితరులు ఉన్నారు.
Admin
Amaravathi Jyothi