Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : అనాధకు ఆధార్ అందజేసిన ఎంపీడీవో వెంకటేశ్వరరావు గుడ్లూరు: ఎక్కడ పుట్టాడు చెప్పేందుకు నోరు మెదపలేని ఓ మూగ అనాధకి గుడ్లూరు ఎంపీడీవో వెంకటేశ్వరరావు సహకారంతో శుక్రవారం ఆధార్ కార్డు అందజేయడం జరిగింది సుమారు పది సంవత్సరాల నుంచి గుడ్లూరులో నివాసం ఉంటున్న మూగవాడైన రాము అనే అనాధకు ఆధారాలు ఏమి లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించిన గుడ్లూరు సిపిఎం శాఖ ఈ సమస్యను ఎంపీడీవో వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లారు అయితే ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ఎంపీడీవో వారం రోజుల లోపే అతనికి ఆధార్ ఇప్పించేందుకు చర్యలు తీసుకున్నారు ఈ మేరకు మండలంలోని దారకాపాడులో జరుగుతున్న ఆధార్ ప్రత్యేక క్యాంపులో తెలియపరచి జటిలంగా మారిన ఆధార్ సమస్యను పరిష్కరించేందుకు ఎంపీడీవో చర్యలు తీసుకోవడం పట్ల గుడ్లూరు సిపిఎం శాఖ హర్షం వ్యక్తం చేసింది ఈ కార్యక్రమంలో సిపిఎం గుడ్లూరు నాయకులు జి వెంకటేశ్వర్లు కొట్టే వెంకయ్య ఎంజాలయ్య దామ కృష్ణయ్య పాలకుర్తి నాగేశ్వరరావు ఎం వెంకటేశ్వర్లు రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు
Admin
Amaravathi Jyothi