Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కావ్యకు ఎదురేగి ఆత్మీయ స్వాగతం పలికిన ఆముదాలదిన్నె ప్రజలు కావలి,అమరావతి జ్యోతి: పూలవర్షం నడుమ గ్రామ వీధుల్లో భారీ ర్యాలీ, మా నేత కావ్య, మా కాబోయే ఎమ్మెల్యే కావ్య అంటూ నినదించిన గ్రామం. ఎమ్మెల్యేగా తిరిగి గ్రామానికి రావాలంటూ రామాలయంలో పూజాదికాలు నిర్వహించిన గ్రామస్థులు, ఆశీర్వదించిన వేద పండితులు. అనంతరం గ్రామస్థులతో కలిసి చలివేంద్రాన్ని, పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కావ్య కృష్ణారెడ్డి. గ్రామంలో రోడ్లు, తాగునీరు, సాగు నీరు సమస్యలను ఏకరువు పెడుతూ పరిష్కరించాలని తాము అండగా నిలబడి గెలిపించుకుంటామని నినదించిన ఆముదాలదిన్నె వాసులు. ఈ సందర్భంగా కావ్య క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ ఉత్సాహం, ఆనందం చూస్తుంటే గెలిచిన ఆనందం కలుగుతుందన్నారు. రూరల్ మండలంలో మొదటిగా వచ్చిన గ్రామం ఆముదాలదిన్నె అని తెలిపారు. గ్రామానికి విచ్చేస్తే మీరు చూపిన ఆప్యాయత, అనురాగం ఎప్పటికీ మరచిపోలేనని తెలిపారు. మీ స్మశానాన్ని కూడా ఆక్రమించిన వ్యక్తి మన ఎమ్మెల్యే అని విమర్శించారు. తుమ్మల పెంట రోడ్డుకు 5 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేస్తే రోడ్డు వేయలేని ఎమ్మెల్యే మనకు అవసరమా? అని ప్రశ్నించారు. గ్రామంలో సిసి రోడ్లు లేవు, డ్రైనేజీ లు లేక రోడ్డు పై మురుగు పారుతుందన్నారు. ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా స్వాహా చేయడమే ధ్యేయంగా ఎమ్మెల్యే ఉన్నారని విమర్శించారు.. చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే ఉన్న పధకాలే కాకుండా బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ పధకం ద్వారా మరిన్ని పధకాలు కూడా ఇవ్వనున్నారని తెలిపారు. సూపర్ సిక్స్ పధకాలను ఈ సందర్భంగా వివరించారు. ఎన్నో సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబు గారిది అని అన్నారు. రైతులకు సాగునీరు అందించలేని దుస్థితి లో మన పాలకులు ఉన్నారన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే సొంత డబ్బులు పెట్టి అయినా సరే తుమ్మలపెంట రోడ్డును పూర్తి చేస్తాను అని ప్రజలకు హామీ ఇచ్చారు.. గ్రామం నుండి 400 ఓట్ల మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండలం అధ్యక్షుడు ఆవుల రామకృష్ణ, రూరల్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకట్రావు, మండల కో-ఆర్డినేటర్ కండ్లగుంట మధుబాబు నాయుడు, జనసేన కావలి పట్టణ అధ్యక్షులు పొబ్బా సాయి విఠల్, గ్రామ కమిటీ అధ్యక్షులుఉప్పాల నారాయణ, మాజీ సర్పంచ్ ఉప్పాల మాలకొండయ్య, మాజీ సర్పంచ్ అరగల రాములు, గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు జంపాని శ్రీను, షేక్ అహ్మద్, షేక్ రఫీ, ఉప్పాల దినేష్, కొమర ప్రసాద్, కోసూరి వెంకటేశ్వర్లు, టీడీపీ-జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
Admin
Amaravathi Jyothi