Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు : రామయ్య ఫౌండేషన్ ట్రస్ట్ ఛైర్మెన్ ఉన్నం నళినీ దేవి ఆధ్వర్యంలో జరిగిన వినికిడి యంత్రాల వితరణ కార్యక్రమంకు అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయిన వలేటివారిపాలెం అయ్యవారిపల్లి వాసి మంచాల పెద్ద గంగయ్యకి సోమవారం కందుకూరులో నళినీ దేవి కార్యాలయంలో వినికిడి యంత్రాన్ని అమర్చడం జరిగింది ... ఈ సందర్భంగా నళిని దేవి మాట్లాడుతూ ... ముందుగా యంత్రాలు ఇచ్చిన వారందరితో మా ఆఫీస్ నుంచి సంపర్కం లో వున్నారని .. యంత్రాలు తీసుకున్న వారందరు పరికరాల పనితీరు సంతృప్తి కరం గా ఉందని ఆనందం గా చెపుతున్నారని చెప్పారు. పెద్ద గంగయ్య మాట్లాడుతూ తాను అనివార్య కారణాల వాళ్ళ క్యాంపు రోజున రాలేకపోయినా వారికి యంత్రాన్ని అమర్చడం చాల ఆనందం గా వున్నదని నళినీ దేవికి కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమంలో వేమ వెంకటేశ్వర్లు, జడ లక్ష్మీనారాయణ మరియు పామంచి రమణయ్య పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi