Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ప్రజాస్వామ్యంలో చీకటి రోజు కందుకూరు అమరావతి: సీఎం వైఎస్, జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో జరిగిన రాళ్ల దాడి ప్రజాస్వామ్యంలో చీకటిరోజు లాంటిదని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. సీఎంపై రాళ్ల దాడిని తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు చేయటం వలన అసాంఘిక శక్తులు చెలరేగే అవకాశం ఉందన్నారు. అధికారులు వెంటనే దోషులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తిపై ఇలాంటి దాడులు జరగటం హేయమైన చర్యన్నారు. ఇటువంటి దాడులు చేయడం వలన అసాంఘిక శక్తులు చెలరేగే అవకాశం ఉందని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. రాబోవు ఎన్నికలు కక్షలు, కార్పన్యాలు, డబ్బులతో ముడిపడి ఉన్నాయని దీన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు. కొంతమంది వ్యక్తులు ఈ దాడిని ముఖ్యమంత్రే స్వయంగా చేయించుకున్నాడని ప్రకటించడం అది వారి విజ్ఞతకే వదిలేస్తామన్నారు. ఈ విధంగా దాడులు ఎవరు మెప్పు పొందేందుకు చేస్తున్నారు వారు రానున్న రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రికే రక్షణ లేకపోతే రానున్న రోజుల్లో సాధారణ ప్రజానీకానికి ఎంత మాత్రం రక్షణ ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఈ విధమైన దాడులు చేయడం వారి యొక్క దిగజారుడుతనానికి నిదర్శనమని తెలిపారు. అధికారులు స్పందించి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Admin
Amaravathi Jyothi