Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : సేవకు వందనం వార్డు ప్రజల అభిమానం పొందుతున్న పెనుమల్లి కావలి, అమరావతి జ్యోతి ; కడుపు నిండిన వారికి పంచ పరమాన్నాలు పెట్టేదానికన్నా ఆకలిగా ఉన్నవారికి సమయానికి కడుపునిండా పట్టెడు అన్నం పెడితే అదే నిజమైన సేవకు దర్పణం పడుతుంది.. "ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న" అన్న స్ఫూర్తికి 29వ వార్డు వైసీపీ ఇన్చార్జి "పెనుమల్లి అశోక్" భాష్యం చెప్పారు. విధి వంచితుడైన ఓ బాలుడు పుట్టుకతోనే శారీరిక, మానసిక వికలాంగుడిగా జీవిస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాల నుంచి మస్తాన్ సుజాత నిరుపేద దంపతులు 29వ వార్డులో జీవనం సాగిస్తున్నారు. వారికి హర్షవర్ధన్ కుమారుడు ఉన్నారు. పుట్టుకతోనే శారీరిక మానసిక వికలాంగుడు. ఆబాలుడికి గతంలో వికలాంగ పెన్షన్ వస్తు కొన్ని ఆణివార్య కారణాలవల్ల పెన్షన్ ఆగిపోయింది. దాంతో ఆ బాలుడు వైద్య ఖర్చులకు డబ్బులు లేక తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడ్డారు. కూలి నాలి చేసుకుంటూ వచ్చిన డబ్బులతో మందులు కొనిచ్చేవారు. ఒక ప్రక్క పేదరికం మరో పక్క బిడ్డకి మందులు కొనిచ్చే స్తోమతలేక ఆతల్లిదండ్రులు కన్నీటి పర్వతంఅవుతున్నారు.ఈవిషయం వార్డు వైసిపి ఇంచార్జ్ దృష్టికి తెచ్చారు. ఆ పేద దంపతుల పరిస్థితిని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చి ఆ బాలుడికి వికలాంగుల పెన్షన్ మంజూరు చేపించారు. శనివారం పెన్షన్ డబ్బులు బాలుడు చేతికి ఇవ్వటంతో ఆ నిరుపేద తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఆ డబ్బులతో బాబుకు మందులు కొనటానికి వస్తాయని కన్నీళ్లు తుడుచుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి నిరుపేదలకు సేవ చేసినప్పుడేకదా నిజమైన సేవకు నిర్వచనం. ఆ మంచి మనసు ఉన్న పెనుమల్లు అశోక్ ను వార్డ్ ప్రజలు అభినందనలతో ముంచెత్తారు. ఎదుటి వారు ఎంతటి వారు అయిన చిరు నవ్వు తో పలకరించే వ్యక్తి అందరివాడు అని కొనియాడారు.
Admin
Amaravathi Jyothi