Thursday, 11 June 2026 08:54:05 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

మహిళలకు గౌరవం టిడిపితోనే సాధ్యం

Date : 09 March 2024 01:07 AM Views : 251

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : మహిళలకు గౌరవం టీడీపీ తోనే సాధ్యం కావలి,అమరావతి జ్యోతి : మహిళలకు గౌరవం టీడీపీ తోనే సాధ్యమని కావలి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి పేర్కొన్నారు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కావలి టీడీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ మరియు పలు అనుబంధ సంఘాల మహిళలు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా కావలి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.. కేకు ను కట్‌ చేసి మహిళలకు పంచి, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు..ఈ సందర్భంగా కావ్య క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ మహిళల కోసం తెలుగుదేశం పార్టీ విశేషంగా కృషి చేసిందన్నారు.. మహిళలకు రిజర్వేషన్లు, మహిళల పేరు మీదనే పధకాలు ఇవ్వడం జరిగిందన్నారు.. ఓర్పు, సహనం కలిగిన వారు మహిళలు అని అన్నారు.. మహిళలకు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పధకాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.. బాబు ష్యూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో మహిళలు ఉచితంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇవ్వడం, బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం జరుగుతున్నారు..18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు రూ1500 ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.. తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి చౌదరి మాట్లాడుతూ మహిళలకు టీడీపీ ప్రభుత్వం అనేక పధకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.. నూతనంగా మహిళలకు ‘‘కలలకు రెక్కలు’’ పధకం టీడీపీ-జనసేన పార్టీలు ఉమ్మడిగా ప్రకటించడం జరిగిందని, ఇంటర్మీడియట్‌ పూర్తి అయ్యి చదువుకోవడానికి ఆర్ధిక స్థోమత లేక వృత్తి విద్యాకోర్సులు చేయాలనుకునే వారికి ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి బ్యాంక్‌ లోన్‌ ద్వారా సహకారం అందివ్వడం జరుగుతుందని, దేశంలో ఎక్కడైనా చదువుకోవచ్చని, రుణం పై వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు.. దీనికి సంబందించిన రిజిస్ట్రేషన్‌ లు ప్రారంభం కావడం జరిగిందని, టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.. తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి అలేఖ్య మాట్లాడుతూ చంద్రబాబు ఆశీస్సులతో 2014 నుండి 2019 వరకు నేను కావలి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గా పనిచేయడం జరిగిందన్నారు.. మహిళలకు టీడీపీ ఇస్తున్న గౌరవానికి నిదర్శనం నేను అని తెలిపారు..ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని టీడీపీ అనుబంధ పలు విభాగాల మహిళలు పాల్గొన్నారు..

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :