Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : సీఎం సహాయ నిధి చెక్కులు అందజేత కందుకూరు, అమరావతి జ్యోతి: అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పనలో భాగంగా సింగర పాలెం గ్రామానికి చెందిన చాగం రమణయ్య కుటుంబానికి సీఎం సహాయనిధి ద్వారా రూ, 1,20,000, శ్రీరంగ రాజపురం గ్రామానికి చెందిన పూనూరు ప్రభాకర్ రెడ్డి కు రూ.80,000 చెక్కులను జడ్పిటిసి ప్రతినిధి తొట్టెంపూడి శ్రీనివాసులు లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా తొట్టెంపూడి శ్రీనివాసులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబం చెందిన పేదలు అనారోగ్యం బారీన పడటంతో వైద్య ఖర్చులు నిమిత్తం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవటంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారన్నారు. ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. లబ్ధిదారులు మాట్లాడుతూ కష్టకాలంలో ముఖ్యమంత్రి,శాసనసభ్యులు ఆర్థిక సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.
Admin
Amaravathi Jyothi