Monday, 27 July 2026 04:37:51 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న జి. ఈశ్వరమ్మ

Date : 06 September 2025 11:59 PM Views : 461

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు: ఉపాధ్యాయురాలు జి. ఈశ్వరమ్మ సేవలకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక చేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి విజయవాడలోని ఏ వన్ కన్వెన్షన్ హాలులో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవం వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. పీసీపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలుగా జి ఈశ్వరమ్మ పనిచేస్తున్నారు. ప్రకాశం జిల్లా నుంచి ఎంపికైన నలుగురి లో ఆమె ఒకరు. ఈ అవార్డు ఆమె సుమారు 30 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తి కి చేసిన సేవల తో పాటు విద్యార్థి లోకానికి అందించిన సేవల కృషి ఫలితం. ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన పల్లెటూరు పంతులమ్మ, ఉపాధ్యాయిని గా, కవిత మూర్తిగా, విద్యార్థి లోకానికి అక్షరాలు దిదించే అయ్యావారమ్మ.. ఖాళీ సమయం లో తన రచనలతో సమాజాన్ని తటి లేపే కవయిత్రి. ఈశ్వరీ భూషణం అనే కలం పేరు తో సాహిత్యంలో 2 వేల కవితలు రాశారు. ఆమె రాసిన మట్టి పాదం పుస్తకం అచ్చు వేశారు. అంతేకాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున కథా వాచకం, బాలగేయాలు పుస్తకాలలో 30 గేయాలు, కవితలు ముద్రించడం జరిగింది. ఆమెకు రచన శైలి తన తాత గారి నుంచి పొందింది. ఆయన ఆ రోజుల్లో పాటలు, పద్యాలు సొంతంగా పడేవారు. ఇలా వారి నుంచి పొందిన కవిత భవనతో పాటు. ఉపాధ్యాయ వృత్తి లో కూడా ఎందరో పేద, మధ్య తరగతి సామాన్యులతో పాటు, గిరిజన పేద బిడ్డల జీవితాల్లో విద్య వెలుగులు నింపారు. 1996 డీఎస్సీలో ఉద్యోగం సాధించిన నాటి నుంచి ఆమె సేవలు ప్రారంభం అయ్యాయి. మొదట వలేటివారిపాలెం మండలం అంకభూపాలపురం ప్రాధమిక పాఠశాల సెకండరీ గ్రేడ్ టీచర్ గా ఈశ్వరమ్మ ఉపాధ్యాయ ప్రస్థానం ప్రారంభం అయ్యింది. అక్కడ నుంచి కందుకూరు తో పాటు చుట్టూ పక్కల గ్రామాల్లో పిల్లల కు విద్య బుద్దులు నేర్పించారు. అంతేకాక పేద పిల్లలకు ఏక రూప దుస్తులు, రాత పుస్తకాలు ఉచితంగా అందించేవారు. అందుకోసం తన సంపాదన లో కొంత కేటాయించేవారు. ఇలా చేస్తూనే వారిలో ప్రతిభ వంతులని గుర్తించి. వారికి నవోదయ, ఏ. పి. రెసిడెన్సియల్, పాఠశాల ప్రవేశ పరీక్ష లకు తర్ఫిదు ఇచ్చి. వారికి సీట్లు వచ్చేంత వరకు సాధన చేయించి.. ఎందరో జీవితాల్లో విద్యా వెలుగులు నింపారు. అంతేకాక స్వచ్చంద సేవా సంస్థల ద్వారా పాఠశాలకు, విద్యార్థుల కు అవసరమైన మౌలిక వసతులు సమాకూర్చారు. ఇలా ఆమె వంతుగా ఎంత చేయాలో అంత కంటే రెట్టింపుగా చేసిన కృషి ని గుర్తించి న రాష్ట్ర ప్రభుత్వం ఆమె సేవలకు మెచ్చి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డుతో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డుతో సత్కరించారు.ఈ సందర్బంగా ఈశ్వరమ్మ కుటుంబ సభ్యులు, తోటి ఉపాధ్యాయులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: