Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు జనార్ధన స్వామి ఆలయ ప్రాంగణమునందు ఉన్న శ్రీ సువర్చల ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమత్ దీక్ష పరులతో స్వామివారికి పంచామృతాభిషేకము తదుపరి స్వామివారికి 108 హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమము గురుస్వామి హనుమత్ ప్రసాద్ స్వామి వారి ఆధ్వర్యంలో జరిగింది.ఆలయ ప్రాంగణం అంత శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో హనుమత్ దీక్షాపరులు మరియు హనుమత్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.చాలీసా అనంతరం స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీకాంత్ స్వామి అను ఒక హనుమత్ భక్తుడు దీక్షపరులకు మరియు భక్తులకు అన్నప్రసాదాలను అందించారు.
Admin
Amaravathi Jyothi