Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : తుఫాను నేపథ్యంలో, లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు, అమరావతి జ్యోతి: కందుకూరు పట్టణంలోని జనార్ధనకాలనీ, ఎస్టీ కాలనీ, ఏకలవ్యనగర్ ప్రాంతాలలో నీటమునిగిన ఇళ్లను నాగేశ్వరరావు, పార్టీ నాయకులు పరిశీలించారు. బాధితులతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకోవడంతో పాటు ధైర్యం చెప్పారు. వారందరికీ భోజన ఏర్పాట్లు చేశారు. ఈరోజు రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నాగేశ్వరరావు సూచించారు. తమ పార్టీ నాయకులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ఎలాంటి అవసరం వచ్చినా సంప్రదించాలని సూచించారు. అలాగే టి ఆర్ అర్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటుచేసిన శిబిరాలకు వెళ్లి, అక్కడ ఆశ్రయం పొందుతున్న వారితో నాగేశ్వరరావు మాట్లాడారు. భోజనం, మంచినీళ్లు, ఇతర సౌకర్యాల గురించి ఆరా తీశారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పలువురు నాయకులు నాగేశ్వరరావు వెంట ఉన్నారు.
Admin
Amaravathi Jyothi