Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎం ఎల్ ఏ మహీధర్ రెడ్డి. కందుకూరు, అమరావతి జ్యోతి:: మిచౌంగ్ తుఫాన్ కారణంగా కందుకూరు పాలిటెక్నిక్ కళాశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ పునరావాస కేంద్రనికి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా చేర్చారు. కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి పునరావాస కేంద్రం పరిశీలించి వారికి కావలసిన ఏర్పాట్లుతో పాటు భోజనం తదితర ఏర్పాట్లు చేశారు. అంతే కాకుండా పునరావాస కేంద్రంలో ఉన్న వారికి మీరేం భయపడవద్దు నేను మీకు అండగా వుంటాను అని భరోసా ఇచ్చారు. అధికారులను కూడా అప్రమత్తం చేశారు. మిచౌంగ్ తుఫాను ప్రభావంతో ముంపు గ్రామాల కోసం కందుకూరు ఏఎంసి కార్యాలయం ఆవరణంలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలను ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి పరిశీలించారు. పునరావాస కేంద్రంలో తల దాచుకుంటున్న ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వాటిల్లకుండా ఆహారము, మంచినీరు విద్యుత్ సౌకర్యంతో పాటు అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఏ చిన్న సమస్య వచ్చిన ఎప్పటికప్పుడు పునరావాస కేంద్రాలకు సంబంధించిన సమాచారం తెలియజేయాలని అధికారులకు సూచించారు.విక్కీరాలపేట రోడ్డు సుందరయ్య నగర్ పునరావాస కేంద్రంలో తల దాచుకున్న తుఫాన్ బాధితులకు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఆదేశాల మేరకు పులిహోర పంపిణీ చేసిన పట్టణ వైయస్సార్ సీ పీ నాయకులు ఎస్.కె. రఫీ, గణేశం గంగిరెడ్డి, రహీం, మహబూబ్ బాషా తదితరులు.
Admin
Amaravathi Jyothi