Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : అప్పుడు కోడికత్తి ... ఇప్పుడు రాయి *డ్రామాలు కట్టిపెట్టు జగన్* *నీ యాక్షన్ ప్రజలకు అర్థమైపోయిందిలే* కందుకూరు, అమరావతి జ్యోతి: రెండు రోజుల క్రితం జగన్ పై రాయి దాడి జరగడం, అది చంద్రబాబు చేయించినట్లు వైసిపి అండ్ నీలిమీడియా ప్రచారం చేయడాన్ని చూసి జనం తెగ నవ్వుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో విశాఖలో కోడి కత్తి డ్రామా ఆడి సానుభూతి పొందావు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య, చంద్రబాబు చేయించినట్లుగా సొంత మీడియాలో రాయించి ప్రజలను నమ్మించావు. మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా, ఐప్యాక్ ఐడియాతో ఈసారి రాయితో దాడి కి ప్లాన్ చేశావు. దాన్ని కూడా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి ఆపాదించడం దారుణం. రాత్రి జరిగిన సంఘటనతో నీ యాక్షన్ గురించి ప్రజలకు పూర్తిగా అర్థమైంది. గతంలో నువ్వు నడిపించిన కథలన్నీ ఇలాంటివే అని జనం అర్థం చేసుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోతామని ముందే గ్రహించి సరికొత్త నాటకానికి తెరలేపావు. ఇలాంటి డ్రామాలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని గుర్తుంచుకో. నీ దోపిడీ, నీ బెదిరింపులు, నీ దుర్మార్గపు పాలన వద్దని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. నెల తర్వాత తట్టా బుట్టా సర్దుకుని తాడేపల్లి ప్యాలెస్ నుంచి జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండు జగన్ అని కందుకూరు నియోజకవర్గ టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి. ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు.
Admin
Amaravathi Jyothi