Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : లింగసముద్రం: లింగసముద్రం మండలంలో ఇంటూరి నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం ప్రజాభిమానంలో హోరెత్తుతోంది. ఎక్కడికి వెళ్లినా, ఊరు వాడా ఏకమై ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. వలేటివారిపాలెం మండలం లోని బొంతవారిపాలెం, లింగసముద్రం మండలంలోని చినపవని, అన్నెబోయినపల్లి, పెదపవని గ్రామాల్లో ఆయన ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి చోటా ఆయన పూల వర్షంలో తడిసిపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ దివి శివరాం, మండల పార్టీ అధ్యక్షుడు వేముల గోపాలరావు, పార్టీ సీనియర్ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వాళ్లంతా ఈసారి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను పదిమందికి వివరిస్తూ, వారి చేత కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేయించాలన్నారు. స్థానికుడైన తాను ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఒక్కసారి అవకాశం ఇస్తే నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నాగేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. చినపవని గ్రామంలో. కొమ్మి లక్ష్మీనారాయణ, వెంకట ప్రసాద్, దామా చిన్నబ్రహ్మయ్య, పిడతల మాల్యాద్రి, కిషోర్ బాబు, శెట్టిపల్లి మాల్యాద్రి, మాలకొండయ్య, గుండెమడుగుల చిన్నబ్బాయి, దీవెనకుమార్, తొండల యేసురత్నం, ఒంగోలు మధు, గుడిమెట్ల నాగార్జున, పూరిమిట్ల దిబ్బయ్య, బండి పెద్దబ్రహ్మయ్య, గుండెమడుగుల చిన్నపోలయ్య, గుండెమడుగుల రోశయ్య, ఊరుపల్లి యాకోబు, సునీల్ తదితరులు పార్టీలో చేరారు ఆర్.ఆర్.పాలెం నుంచి వైసిపి ముఖ్యనాయకుడు, ఆర్ఆర్ పాలెం సర్పంచ్ చింతగుంపల వీరభద్రయ్య టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతోపాటు చొప్పర శ్రీను, రమణయ్య, వెంకటేశ్వర్లు, భార్గవ్, ఆనమసాని చెన్నుకృష్ణ, శ్రీహరి, యడవల్లి మోహన్ తదితర కుటుంబాలు పార్టీలో చేరాయి. అన్నెబోయినపల్లిలో. గ్రామానికి చెందిన బండ్లమూడి లక్ష్మీనరసింహం, వంకదారి రమణయ్య, కొనికే రామారావు, వంకదారి రాములు, యర్రజొన్న వీరయ్య తదితరులు పార్టీలో చేరారు. ఉలవపాడు మండలం కరేడు నుంచి. కరేడు పంచాయతీలోని ఓరుగంటిరెడ్డిపాలెం నుంచి మాజీ వైస్ సర్పంచ్ ఆసోది కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, కోటిరెడ్డి , సాయిభానురెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, సురేష్ రెడ్డి, చిట్టా నాగేశ్వరరావు, అరవ సురేష్ రెడ్డి,తీగల రవికుమార్ రెడ్డి, చిట్టా శివాజీరెడ్డి, చిలకా మాధవరావు, పెళ్లేటి ప్రసాద్ రెడ్డి, చిట్టా బ్రహ్మయ్య, పాదాల శివకుమార్ రెడ్డి, రంగని రాములురెడ్డి, పల్లెబోయిన శ్రీనివాసులురెడ్డి, పిన్ని వెంకారెడ్డి, అఖిల మస్తాన్ రెడ్డి, కంసాని సుబ్బారెడ్డి తదితరులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమాల్లో లింగసముద్రం మండల ప్రధాన కార్యదర్శి పూరిమిట్ల మాల్యాద్రి, చినపవని నాయకులు సోంపల్లి మనోహర్, ఉమ్మనేని నరసింహారావు, కేశినేని నాగేశ్వరరావు, ముళ్లపాటి చౌదరి, పారా బుచ్చయ్య, ముళ్లపాటి మహేష్, మాదవరపు బ్రహ్మయ్య, సుబ్బిశెట్టి మోహన్రావు, షేక్ బాబు, కొల్లూరు సుబ్బారావు, పిడతల నరసింహారావు, జనసేన నాయకులు ఇనకొల్లు శ్రీనివాసులు, అన్నెబోయినపల్లి నాయకులు బాసం ప్రసాదు, పాలంకి వెంకటేశ్వర్లు, బండ్లమూడి రామయ్య, శ్రీను, ఆండ్రా మాలకొండయ్య, సాదు ఫల్గుణ, బాసం హరిబాబు, తోట వేణు, కొనికి బాలకృష్ణ, నాగినేని రవి, బింగి వెంకటేశ్వర్లు, జడ బాబూరావు, తోకల కొండయ్య, జడ మోహన్ ,బండ్లమూడి మణి, బొంతవారిపాలెం నాయకులు సాదం సుబ్బారావు, గాయం సుబ్బారావు, గుమ్మా వెంకట్రావు, పెరుగు నాగరాజు, సంగా పాండురంగారావు, సాదం వెంకటరావు, పెరుగు కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
ఒక అవకాశం ఇవ్వాలని ఇంటూరి నాగేశ్వరరావు వినతి
Admin
Amaravathi Jyothi