Monday, 02 March 2026 12:19:56 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీలో గుర్తింపుఎమ్మెల్యే ఇంటూరి

Date : 24 November 2024 07:42 PM Views : 1220

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీలో గుర్తింపు ఎమ్మెల్యే ఇంటూరి *బడుగు బలహీనవర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ* *కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా* *ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించిన జనిగర్ల నాగరాజు *ఎమ్మెల్యేకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన గుడ్లూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు* గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజుకు యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన సందర్భంగా.. ఆదివారం కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ సమావేశాల తర్వాత నియోజకవర్గానికి విచ్చేసిన ఇంటూరి నాగేశ్వరరావుకి జనిగర్ల నాగరాజు శాలువాతో ఘనంగా సత్కరించి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.. ముందుగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులునందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ కష్టపడిన ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఉంటుందని, పార్టీ ఎల్లప్పుడు బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి వారి అభ్యున్నతికి కృషి చేస్తుందని తెలిపారు. జనిగర్ల నాగరాజుకు యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ గా రావడంతో తెలుగుదేశం పార్టీ బీసీలకు మంచి గుర్తింపు ఉంటుందని రుజువైందని తెలిపారు.. గుడ్లూరు మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను అందరిని సమన్వయం చేసుకుంటూ, తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో మెజార్టీ వచ్చేలా నాగరాజు పని చేశాడని తెలిపారు. నియోజకవర్గం నా విజయం కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు.. నియోజకవర్గంలో ఎక్కువగా ఉండే బడుగు బలహీన వర్గాలకు గత వైసిపి ప్రభుత్వంలో ఎటువంటి గుర్తింపు రాలేదని విమర్శించారు.. కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు బడుగు బలహీన మంచి గుర్తింపు ఉంటుందని గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ పదవి, మాలకొండ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చారని ఎమ్మెల్యే గుర్తు చేశారు.. ఈ కార్యక్రమంలో గుడ్లూరు మండలం పార్టీ అధ్యక్షులు మరియు యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ నియమితులైన నాగరాజు మాట్లాడుతూ ముందుగా నాకు ఈ పదవి రావడానికి కారణమైన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఇంటూరి నాగేశ్వరరావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకి మన యువ నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ కి మరియు రాష్ట్ర మంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ కి, బిజెపి జనసేన నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. తెలుగుదేశం పార్టీలో నాకు ఇంత గుర్తింపు రావడానికి కారణమైన గుడ్లూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీలో బీసీలకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని, నాకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.. గత ఎన్నికల్లో గుడ్లూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి భారీ మెజార్టీ రావడానికి మరియు ఇంటూరి నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంలో మండల పార్టీ అధ్యక్షులు పనిచేయటం చాలా ఆనందాన్నిచ్చిందని నాగరాజు తెలిపారు.. అనంతరం నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు నాగరాజుకు అభినందనలు తెలిపారు . ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, ఉలవపాడు మండల పార్టీ అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు, పార్టీ నాయకులు చిలకపాటి మధుబాబు, చెరుకూరి సూర్యనారాయణ, షేక్ రఫీ, బెజవాడ ప్రసాద్ మరియు పట్టణ, మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు..

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :