Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు : కందుకూరు అంకమ్మ గుడి సమీపాన మెడికల్ షాపు వద్ద ఉంచిన ఏపి 39 క్యూ బి 8100 నెంబర్ గల హెచ్. ఎఫ్ డీలక్స్ హీరో మోటార్ సైకిల్ అపహరణకు గురైనదని కందుకూరు పట్టణానికి చెందిన పాశం నవీన్ ఫిర్యాదు మేరకు కందుకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న ఎస్ఐ వి. సాంబ శివయ్య తన సిబ్బందితో శుక్రవారం ఉదయం 10 గంటల 15 నిమిషాల సమయంలో ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన గుంటక.చిన మాల కొండయ్య కుమారుడు మాల్యాద్రిని ఇంటి దగ్గర అరెస్ట్ చేసి అతని వద్ద నుండి సదరు పాశం నవీన్ కు సంబంధించిన మోటార్ బైక్ తో పాటు, కందుకూరు పొన్నలూరు హైదరాబాద్ భీమవరం తదితర ప్రాంతాల్లో దొంగలించిన మరో ఐదు బైకులను మొత్తం సుమారు రెండున్నర లక్షల రూపాయలు విలువగల ఆరు మోటార్ బైకులు అతని నుండి స్వాధీనపరచుకొనడమైనది. సదరు ముద్దాయి గుంటక మాల్యాద్రిని రిమాండ్ నిమిత్తం కందుకూరు కోర్ట్ జడ్జి ముందు హాజరు పరచినట్లు ఎస్.ఐ సాంబ శివయ్య విలేఖరులకు తెలిపారు.
Admin
Amaravathi Jyothi