Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు: పట్టణంలోని కూరగాయల మార్కెట్ సెంటర్ లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన నెల్లూరు పార్లమెంటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుతో పాటు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించినట్లు నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గోచిపాతల మోషే ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్డీఏ కూటమి తరపున నెల్లూరు పార్లమెంటు ఎంపీగా భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత తొలిసారిగా కందుకూరు రావడంతో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నియోజకవర్గం పరిధిలోని ఎన్డీఏ కూటమి నాయకులు మరియు కార్యకర్తలు భారీగా చేరుకొని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఘన స్వాగతం పలికినట్లు మోషే మీడియాకు తెలియజేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలిసిన వారిలో కందుకూరు నియోజకవర్గం ఎస్సీ సెల్ కార్యదర్శులు దువ్వూరి రమేష్ చంద్ర , గౌడపేరు ప్రసాద్ రావు , ఉలవపాడు మండలం తెలుగుయువత కార్యనిర్వాహక కార్యదర్శి గడ్డం నవీన్ , కట్టా శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.....
Admin
Amaravathi Jyothi