Amaravathi Jyothi - Andhra Pradesh / అనంతపురం : హిందూపురం, అమరావతి జ్యోతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మళ్లీ మోసం చేయడానికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోజూ ఉత్తుత్తి వాగ్దానాలతో బహిరంగ సభలలో మాట్లాడుతున్నారని, ఇప్పుడు జగన్ రెడ్డి మోసపు వాగ్దానాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలుగు దేశం పార్టీ మహిళా నాయకురాలు ఉన్నం.నళినీ దేవి అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆమె హిందూపురం పట్టణంలో బాలకృష్ణ సతీమణి వసుంధరా దేవితో కలిసి బహిరంగ సభలో పాల్గొని ఘాటుగా విమర్శించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ హిందూపురం పట్టణం లో ప్రధాన కూడలి వద్ద ఆదివారం ప్రచారం నిర్వహించిన అనంతరం బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నళినీ దేవి మాట్లాడుతూ 20 నెల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిందూపురం వచ్చినప్పుడు నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారని అన్నారు. ఇప్పుడేమో ఆ వరాలు కాస్తా అదృశ్యమై పోయాయని అన్నారు. హిందూపురం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం, వసతుల కల్పన కోసం అనేక హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. ఉత్తుత్తి హామీలతో ప్రజలను మోసం చేయడమే జగన్ నైజం అన్నారు. హిందూపురం నియోజకవర్గ ప్రజలు ఇవన్నీ ఆలోచించి రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి.బాలకృష్ణ తోబాటు ఎం.పి.అభ్యర్థికి మీ అమూల్యమైన ఓటు వేయాలని ఉన్నం నళినీ దేవి ఓటరు మహాశయులకు సూచించారు. హిందూపురం తెలుగు దేశం, జనసేన, బిజెపి కూటమి తరుపున ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి.బాలకృష్ణ , ఎంపీ అభ్యర్థి తదితరులకు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరా దేవితో మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం తమ వంతుగా కృషి చేస్తున్న బాలయ్యను.అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రానున్నది రామ రాజ్యమేనని ప్రజలు సురక్షితంగా జీవించ వచ్చునని ఆమె అన్నారు. బహిరంగ సభలో హిందూపురం నియోజక వర్గానికి చెందిన మైనారిటీ నాయకులు ఖలీల్, షేక్ సలాం, షేక్ మున్నా, షేక్ ఖలీల్, జమీల్ అహ్మద్, షకీల్, అబ్దుల్ రహిమాన్, సుబహాని, రబ్బాని, అమిరుల్లా, గయాజ్, బాసీద్, బషీర్, హాజీ, రజాక్, జిలాని, రసూల్, గౌస్ బాషా, ఫయాజ్, వలి, రియాజ్, మహబూబ్ బాష, రియాజ్, రూబి స్థానిక టిడిపి నాయకులు నారాయణ, రమణయ్య, వేణు, పాండు రంగారావు, పట్టణ మహిళానేతలు శైలజ, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi