Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలపడమే మోదీ లక్ష్యం. - కిసాన్ మోర్చా అధ్యక్షులు పి.వి. కృష్ణారావు. తర్లుపాడు.అమరావతి జ్యోతి: ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని 2047 వ సంవత్సరం నాటికి అగ్రస్థానంలో నిలపాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యం అని మార్కాపురం నియోజకవర్గ బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షులు పివి కృష్ణారావు మరియు తర్లుపాడు ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి పేర్కొన్నారు.మండల కేంద్రమైన తర్లుపాడు లోని వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో ఎంపీడీవో ఎస్. నరసింహులు అధ్యక్షతన "వికసిత భారత్ సంకల్ప యాత్ర" కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా మార్కాపురం నియోజకవర్గ బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు పీవీ కృష్ణారావు మరియు ఎంపీపీ భూలక్ష్మి లు పాల్గొన్నారు. ముందుగా మహాత్మా గాంధీ, బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత స్వాతంత్ర సమరయోధులు మరియు పోరాట వీరులు వేషధారణలో నృత్యాలు, నాటక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. తదుపరి ఎంపీపీ భూలక్ష్మి మాట్లాడుతూ భారతీయుల వారసత్వ, సంస్కృతి సాంప్రదాయాలను మరియు భారతదేశ ఔన్నత్యాన్ని, విలువల ప్రాముఖ్యతను గురించి వివరించారు. అనంతరం ఎంపీడీవో ఎస్ నరసింహులు, మండలంలోని పలు శాఖల అధికారులు మరియు భారతీయ స్టేట్ బ్యాంక్ మరియు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్లు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలైన జన్ ధన్ యోజన, స్కిల్ ఇండియా మిషన్ , మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛభారత్ మిషన్,జల జీవన్ మిషన్, పిఎం ఆవాస్ యోజన, పీఎం కిసాన్, సంపత్ ఆదర్శ్ గ్రామ యోజన, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, పీఎం సుకన్య యోజన, సురక్ష బీమా యోజన , జ్యోతి బీమా యోజన, బేటి బచావో బేటి పడావో, శ్రమే జయతే యోజన, స్టాండ్ అప్ ఇండియా, సేతు భారతం యోజన, సావరిన్ గోల్డ్ బాండ్ పథకం, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్, స్మార్ట్ సిటీ పథకం, అటల్ పెన్షన్ యోజన, ఉజాల యోజన,పీఎం ముద్ర యోజన, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, పీఎంఈజిపి సబ్సిడీ లోన్లు వంటి అనేక రకాల పథకాలను గురించి, పథకాల ప్రయోజనాలను గురించి ప్రజలకు వివరించారు.అనంతరం బిజెపి కిసాన్ మోర్చా ప్రతినిధి పివి కృష్ణారావు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం దేశ ప్రజల ప్రయోజనాల కోసం సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ఈ పథకాలను అమలు చేస్తుందన్నారు. ఈ పథకాలన్నింటినీ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం అర్హత కలిగిన లబ్ధిదారులకు ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లను, స్టవ్ లను, ఆయుష్మాన్ భారత్ కార్డులను అతిథులు మరియు అధికారులు చేతుల మీదుగా పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పల్లెపోగు వరాలు, ఎస్బిఐ మేనేజర్ దేవరకొండ బాబు, ఏపీజీబీ మేనేజర్ రామకృష్ణారావు, వెలుగు ఏపిఎం పిచ్చయ్య, వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, పశువైద్యాధికారిని నందన, హౌసింగ్ ఏఈ నిర్మల్ రాజు, ఏపీవో నాగరాజు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, కో ఆప్షన్ అక్బర్ అలీ, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు పోలేపల్లి జనార్ధన్,నెహ్రూ యూత్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు బెడుదురు పుల్లయ్య, పంచాయతీ కార్యదర్శులు అచ్యుతరావు, కాలంగి శ్రీనివాసులు, పలు శాఖల అధికారులు,బిజెపి నాయకులు జవ్వాజి జనార్ధన్, గాయం లక్ష్మిరెడ్డి, నాగరాజు, జవ్వాజి కొండలరావు, కరీం భాష, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi