Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన తెలంగాణ ఆర్టీసీ బస్సు ఇద్దరు మృతి. ఆరుగురికి గాయాలు. గుడ్లూరు , అమరావతి జ్యోతి : గుడ్లూరు మండలం వీరేపల్లి - మోచర్ల గ్రామం మధ్యలో గల ఎన్ హెచ్ 16 రోడ్డు పై ఆదివారం తెల్లవారుజామున సుమారు 3.00 గంటల సమయంలో TS RTC కి చెందిన TS 05 Z 0249 అను నెంబర్ గల సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్ అయిన పోకల వినోద్ కుమార్ . తాళ్లవీరప్పగూడెం గ్రామము దామరచర్ల మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రo నకు చెందినట్లు, బస్సును హైదరాబాదు నందు ప్యాసింజర్ లను ఎక్కించుకొని అక్కడనుండి శ్రీకాళహస్తి మీదుగా తిరుపతికి వెళ్తున్నట్లు, ఆ క్రమంలో గుడ్లూరు మండలం, వీరేపల్లి- మోచర్ల గ్రామం మధ్యలో NH 16 రోడ్డుపై అతివేగముగా, అజాగ్రత్తగా నడిపుతూ తనకు ముందుగా వెళుతున్న AP 03 TD 2133 అను నెంబర్ గల లారీని వెనక వైపు న గుద్దగా, బస్సు ముందు భాగం పూర్తిగా డామేజ్ అయ్యి బస్సు డ్రైవర్ కు, రెండవ డ్రైవర్ కు మరియు కొంతమంది ప్యాసింజర్లకు గాయములైనాయి, ఆ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అయిన పోకల వినోద్ కుమార్ అక్కడికక్కడే మరణించినాడు, మృతుని శవమును కందుకూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నందు శవపరీక్ష నిర్వహించినారు, గాయములైన వారిని 108 అంబులెన్స్ లో కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్య నిమిత్తం మంత్రి ప్రగడా సీత నేరేడుచర్ల టౌన్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రము, అను ఆమెను మరియు ఆమె కుమారుడు సీతారాం, కందాల ఉమాకాంత్ లను నెల్లూరు అపోలో హాస్పిటల్ కు తీసుకుని వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో సీత అను ఆమె చనిపోగా నెల్లూరు రిమ్స్ ఆసుపత్రి మార్చురీ నందు మృతురాలికి శవపరీక్షలు నిర్వహించినారు, మిగతా ఇద్దరు అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు, మరియు కావలి ప్రభుత్వ ఆసుపత్రి నందు కత్తి సంజయ్ కుమార్, అడపాల కోటేశ్వరరావు, అడపాల శ్రీలక్ష్మి,, మరో బస్సు డ్రైవర్ వెంకన్న అను వారు చికిత్స పొందుతున్నారు అని ఈ కేసులో దర్యాప్తు అధికారి అయిన గుడ్లూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె.ప్రసాద్ రెడ్డి తెలిపారు.
Admin
Amaravathi Jyothi