Saturday, 18 July 2026 05:46:27 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

సంక్షేమం అభివృద్దే లక్ష్యంగా వైసిపి పాలన- ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి

Date : 11 February 2024 09:50 AM Views : 366

Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : సంక్షేమం,అభివృద్దే లక్ష్యంగా వైసిపి పాలన. - ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి. తర్లుపాడు. అమరావతి జ్యోతి: సంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్లో వైసిపి ప్రభుత్వం పాలన సాగిస్తుందని మార్కాపురం శాసనసభ్యులు కుందురు నాగార్జున్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మీర్జాపేట, తర్లుపాడు గ్రామాల పరిధిలో మూడు కోట్ల రూపాయల నిధులతో శనివారం పూర్తిచేసిన పలు అభివృద్ధి పనులను మండలంలోని వైకాపా ప్రజా ప్రతినిధులతో, నేతలతో కలిసి ప్రారంభించారు. ముందుగా మీర్జా పేట గ్రామంలో 43 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని, 23 లక్షల 80000 తో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, 20 లక్షల 60000 తో నిర్మించిన హెల్త్ క్లినిక్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా సుపరిపాలనే లక్ష్యంగా పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమన్నారు. అధికారం చేపట్టిన నాలుగున్నర సంవత్సరాల కాలంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమం అందిస్తూ, అభివృద్ధి లక్ష్యంగా, నూటికి నూరు శాతం ఇచ్చిన హామీలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారన్నారు. ప్రతి ఒక్క గ్రామంలో ప్రజలకు అందుబాటులో సచివాలయాలను, రైతుల శ్రేయస్సు పరమావధిగా రైతు భరోసా కేంద్రాలను, ప్రతి గ్రామానికి వైద్య మందారనే లక్ష్యంతో హెల్త్ క్లినిక్ సెంటర్లను, గ్రామాలలో ఎన్నో అంతర్గత రోడ్లను దాదాపుగా పూర్తి చేయడం జరిగిందన్నారు. రాబోయే ఎన్నికలలో మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే విజయకేతనం ఎగురవేస్తుందని, భవిష్యత్ కాలంలో మరింత సంక్షేమం, అభివృద్ధి జరగనుందని ఆయన తెలిపారు. అనంతరం మండల కేంద్రమైన తర్లుపాడులో 43 లక్షల 60 వేల రూపాయలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని, 23 లక్షల 94 వేల రూపాయలతో నిర్వహించిన రైతు భరోసా కేంద్రాన్ని, ఎస్సీ పాలెం లో 54 లక్షలతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ ను, 10 లక్షలతో నిర్మించిన ఆర్వో ప్లాంట్ ను, 40లక్షలతో వేసిన పోలీస్ స్టేషన్ ముందు సిసి రోడ్డుని, ఎస్సీ పాలెంలో 15 లక్షలతో వేసిన సీసి రోడ్డును, 20 లక్షలతో నాయుడు పల్లి గ్రామంలో వేసిన సిమెంట్ రోడ్డును నాయకులతో కలిసి ప్రారంభించారు. తదుపరి నూతన సింగిల్ విండో చైర్మన్ గా ఎక్కంటి రామిరెడ్డిని ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి నియమించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి, పంచాయతీరాజ్ ఈఈ, ఏ.ఈ శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నాగరాజు, మండల పరిషత్ కార్యాలయం సూపర్డెంట్ చంద్రశేఖర్, ఈవో&పిఆర్డి బాలకృష్ణ, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు దూదేకుల పెద్ద మస్తాన్, మండల కన్వీనర్ మురారి వెంకటేశ్వర్లు, సర్పంచులు పల్లె పోగు వరాలు, దూదేకుల పెద్ద మీరయ్య, తాడి రమణారెడ్డి, జనుమాల జాన్ రత్నం,ఎంపీటీసీలు దేవి రెడ్డి పార్వతి, వన్నె బోయిన అంకమ్మ, కో ఆప్షన్ సభ్యులు షేక్ అక్బర్ అలీ, సింగిల్ విండో చైర్మన్ కుందూరు సత్యనారాయణ రెడ్డి, జె ఎస్ కన్వీనర్ కలువ రామాంజనేయరెడ్డి, వైస్ సర్పంచ్ వెన్న సత్యనారాయణ రెడ్డి, వైకాపా నాయకులు నడికట్టు భాస్కర్ రెడ్డి, పల్లె పోగు ఎబినేజర్,షేక్ రసూల్,ఎక్కంటి రామిరెడ్డి, దేవిరెడ్డి రమేష్ రెడ్డి, మందా కొండారెడ్డి, తాటికొండ దాసయ్య,రేగుల అంకయ్య, వన్నె బోయిన బాలయ్య,గుమ్మ రాజేంద్ర ప్రసాదు, చెన్నకేశవులు, గుండె బొమ్మ రమణయ్య, పుచ్చకాయల బాలయ్య, తిరుమల అంజయ్య, మరియు వైకాపా నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: