Amaravathi Jyothi - Andhra Pradesh / Anakapally : కందుకూరు :కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు దంపతులు దసరా పండుగ సందర్భంగా జరుగు దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా కందుకూరులోని పెద్ద బజారులో ఉన్న వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అర్చకులు రాజా స్వామి ఆలయ మర్యాదలతో, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. పూజ అనంతరం అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు. ఆలయ ప్రెసిడెంట్ కోట వెంకట నరసింహం దంపతులు, ఎమ్మెల్యే దంపతులను సన్మానించి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. సౌజన్య ప్రత్యేకంగా ఆర్యవైశ్య మహిళలతో కలిసి పూజ కార్యక్రమంలో పాల్గొని లలితా సహస్రనామ పారాయణం చేశారు. ఆ తర్వాత ఆమెకు అమ్మవారి పసుపు కుంకుమను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దేవీ శరన్నవరాత్రుల్లో దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. అమ్మవారికి చేసిన గాజుల అలంకారం ఎంతో చక్కగా ఉందని ప్రశంసించారు. వాసవి మాత ఆశీస్సులతో కందుకూరు నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ తన్నీరు మల్లికార్జునరావు, ఆర్యవైశ్య నాయకులు మురారిశెట్టి సుధీర్ కుమార్, చక్కా వెంకట కేశవరావు, కాకుమాని ప్రవీణ్ కుమార్, కోటా కిషోర్, విపిజి సుకుమార్ గుప్తా, మురారిశెట్టి వెంకటసుబ్బారావు, తాత లక్ష్మీనారాయణ, కొత్తూరి సుధాకర్ రావు, గుర్రం అల్లూరయ్య బ్రదర్స్, కంకణాల వెంకటేశ్వర్లుతో పాటు ఆర్యవైశ్య మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi