Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గుడ్లూరు, అమరావతి జ్యోతి: ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉలవపాడు నందు గెజిటెడ్ హెడ్మాస్టర్ గా పనిచేయుచున్న కే శివ నాగేశ్వరరావు బుధవారం గుడ్లూరు మండల విద్యాశాఖ అధికారి -1 గా బాధ్యతలు స్వీకరించారు .ఈ సందర్భంగా వారికి ఎం గోవర్ధన్ ఎంఈఓ -2 మరియు విద్యాశాఖ సిబ్బంది సాదరంగా స్వాగతం పలికారు. ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన కే శివ నాగేశ్వరరావుని యుటిఎఫ్ గుడ్లూరు మండల శాఖ, కలిసి వారిని దుశ్శాలువాతో సత్కరించి వారికి శుభాభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి మండల అధ్యక్షుడు జినిగర్ల నాగరాజు మరియు మాజీ అధ్యక్షులు మాల్యాద్రి మరియు పలువురు టిడిపి నాయకులు కలిసి వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది
Admin
Amaravathi Jyothi