Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ప్రకాశం డిప్లమో విద్యార్థుల విజయకేతనం- హరిబాబు కందుకూరు, అమరావతి జ్యోతి: పాలిటెక్నిక్(డిప్లమో) విద్యార్థులకు జిల్లాస్థాయిలో ప్రభుత్వ నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ లో ప్రకాశం డిప్లమో విద్యార్థులు పలు విభాగాలలో విజేతలుగా నిలిచారని ప్రిన్సిపాల్ వి.హరిబాబు వెల్లడించారు. రెండవ సంవత్సరం డిప్లమో విద్యార్థి లక్ష్మీ వరప్రసాద్ 400 మీటర్ల రన్నింగ్ లో మొదటి స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనేందుకు అర్హత సాధించారన్నారు. ట్రిపుల్ జంప్ విభాగంలో జీ.ఓ.మణి ప్రథమ స్థానంతో రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడని హరిబాబు వివరించారు. బాడ్మింటన్ లో పి.విజయ్ కుమార్ టీమ్ జిల్లాస్థాయిలో ద్వితీయ స్థాయి బహుమతిని ప్రకాశం విద్యార్థులు దక్కించుకోవడం హర్షదాయకమన్నారు. అలాగే 1500 మీటర్ల పరుగు పందెంలో ఫస్ట్ యర్ డిప్లమో విద్యార్థి కే.దేవేందర్ తృతీయ బహుమతిని గెలుచుకున్నారు. జిల్లా స్థాయి పోటీలలో తమ విద్యార్థులకు దక్కిన తొలి అవకాశం లోనే పలు బహుమతులను గెలుచుకోవడం కాలేజీ అకడమిక్ ఇన్ చార్జీ ఎస్.ఎం.మీరావలి, డిప్లమా పర్యవేక్షకులు గురు శేషు,రజిని,పి.డి. సుబ్రహ్మణ్యంలు హర్ష వ్యక్తం చేశారు. ఈ విజయానికి కారకులైన సిబ్బందిని కరస్పాండెంట్ కంచర్ల రామయ్య, టెక్నికల్ డైరెక్టరు డాక్టర్ కే. విజయ్ శ్రీనివాస్ అభినందించారు.
Admin
Amaravathi Jyothi