Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : కనిగిరిలో ఘనంగా ముగిసిన విశ్వబ్రాహ్మణ కార్తీక వనభోజనాలు కనిగిరి టౌన్, అమరావతి జ్యోతి : కనిగిరి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి ఆదేశాల మేరకు ఆవుల తిరుపతిరెడ్డి మహిళా డిగ్రీ కాలేజ్ శృతి వనంలో ఆదివారం విశ్వబ్రాహ్మణ కార్తీక వనభోజనా కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముందుగా కార్తీక మాస వన సమారాధన ప్రత్యేక పూజా కార్యక్రమాలు విశ్వబ్రాహ్మణ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రమిదలతో దీపాలు వెలిగించడం తదుపరి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. కనిగిరి కమిటీ వారు ఆహ్వానం మేరకు పిలిచిన వెంటనే వచ్చినటువంటి ప్రకాశం జిల్లా వివిధ మండల స్థాయి నాయకులు, సంఘ నాయకులు తో పాటు వివిధ డిపార్ట్మెంట్స్ లోని సంఘ పెద్దలు పాల్గొనడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చెన్నుపల్లి శ్రీనివాసచారి మాట్లాడుతూ, సంఘం కోసం సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపించుట కోసం ఐకమత్యంతో మనమంతా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అలాగే మన వారంతా కలిసిమెలిసి సంఘంలోని సమస్యలను పరిష్కరించుకోవాలని ఎలాంటి విభేదాలు లేకుండా మనమంతా ముందుకు నడవాలని అన్నారు. అనంతరం కనిగిరి విశ్వబ్రాహ్మణ కమిటీ ఆధ్వర్యంలో సంఘ పెద్దలైన కనిగిరి తహసిల్దార్ లింగాల లక్ష్మీనారాయణ, పి ఈశ్వరయ్య సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సామంతపూడి సుబ్బారావు రిటైర్డ్ డిప్యూటీ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , ఎం రామకృష్ణ సీనియర్ అసిస్టెంట్ ఆర్ డి ఓ ఆఫీస్ కనిగిరి, పిసీపల్లి మండల విద్యాశాఖ అధికారి ఆర్ శ్రీనివాసచారి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వినుకొండ శ్యామల, జిల్లా కార్యదర్శి పనిదపు సుధాకర్, సాయి జస్వంత్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత అజయ్ కుమార్, విద్యుత్ ఏఈ ప్రసాద్, హెచ్ఎం రాఘవాచారి ,వివమండలాల సంఘ అధ్యక్షులు, నాయకులను ఘనంగా కనిగిరి విశ్వబ్రాహ్మణ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలతో సన్మానించడం జరిగినది తదుపరి కార్తిక వనభోజనాలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి కనిగిరి విశ్వబ్రాహ్మణ కమిటీ సభ్యులందరికీ పేరుపేరునా ప్రత్యేక అభినందనలు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస చారి తెలియపరచడం జరిగినది.
Admin
Amaravathi Jyothi