Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఈనెల 13వ తేదీన డాక్టర్ బద్దిపూడి జయరావు రచించిన వర్ణయుగం,ధమనకాండ పుస్తకాల ఆవిష్కరణ సభను జయప్రదం చేయాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బొమ్మ సెంటర్ నందు కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా బెజవాడ విల్సన్ (రామన్ మెగసేసే అవార్డు గ్రహీత), సుప్రసిద్ధ సినీ దర్శకులు E. ప్రేమ్ రాజ్ పాల్గొంటారు. ఈ కార్యక్రమం 13 శనివారం సాయంత్రం 4 గంటలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర) కందుకూరు నందు జరుగును. కనుక కవులు, కళాకారులు, మేధావులు, ప్రజలు అత్యధికంగా పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరడమైనది. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో కె.మోహన్ రావు BTA రాష్ట్ర అధ్యక్షులు,MEF డివిజన్ అధ్యక్షులు జడ రాములు మాదిగ, MRPS జాతీయ ఉపాధ్యక్షులు జలదంకి నరశింగరావు మాదిగ, L. బ్రహ్మయ్య (అడ్వకేట్),MEF జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నంగి రమేష్,D. మోహన్ రావు (టీచర్ )మాలకొండయ్య( M.K) చదలవాడ కోటేశ్వరరావు ఎం ఈ ఎఫ్ మండల నాయకులు,ఎండ్లూరి పోతులూరి( కళాకారుడు). శిరోమణి, క్రిస్టఫర్ ,రవి, చిన్న తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi