Monday, 02 March 2026 12:21:19 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, ఐదు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ.

Date : 30 October 2025 02:48 PM Views : 175

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు: కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు మరియు కందుకూరు సబ్ కలెక్టర్ దామెర హిమవంశీతో కలిసి గురువారం మెంథా తుఫాన్ ప్రభావంతో వరదలకు గురైన కందుకూరు పట్టణ ప్రజలకు పట్టణంలోని మూడో నెంబర్ రేషన్ షాప్ వద్ద తుఫాను బాధితులకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భారీ తుఫాన్ సంభవించినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందస్తు చర్యలతో ఎక్కువ మొత్తంలో నష్టం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, పునరావాస కేంద్రాల్లో మూడు పూటల భోజనం, వైద్య సదుపాయాలు కల్పించారు. ఇప్పుడు వారు తిరిగి గృహాలకు చేరిన తర్వాత, వారి అవసరాల కోసం నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న తుఫాను బాధిత ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం తోపాటు ప్రతి కుటుంబానికి అదనంగా 1 కిలో బంగాళాదుంపలు,1 కిలో పామాయిల్,1 కిలో కందిపప్పు,1 కిలో ఉల్లిపాయలు,1 కిలో చక్కెర వంటి ఐదు రకాల నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగిందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే. అనూష, తహసిల్దార్ లావణ్య, ప్రకాశం జిల్లా డైరీ మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :