Monday, 08 June 2026 12:52:58 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

స్వర్ణ రథం అందజేసిన వేమిరెడ్డి దంపతులు

Date : 16 February 2024 09:36 PM Views : 216

Amaravathi Jyothi - Andhra Pradesh / గుంటూరు : శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివార్లకు స్వర్ణ రథం అందించిన వేమిరెడ్డి దంపతులు రథసప్తమి సందర్భంగా అందజేత. అనంతరం స్వామివారి ఊరేగింపు స్వర్ణ రథం అందజేతపై హర్షించిన భక్తజనం శ్రీశైలం,అమరావతి జ్యోతి: రాజ్యసభ సభ్యులు, సేవా భూషణులు, దాత వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, టిటిడి ఢిల్లీ స్థానిక సలహా మండలి ఛైర్‌పర్సన్‌ ప్రశాంతి రెడ్డి దంపతులు తమ దాతృత్వాన్ని మరోసారి ఘనంగా చాటారు. శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వారికి శుక్రవారం రథసప్తమి సందర్భంగా స్వర్ణ రథం కానుకగా అందించారు. స్వామివారి మహాకుంభాభిషేకం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిగారి సమక్షంలో స్వర్ణ రథ ప్రారంభోత్సవం వైభవంగా నిర్వహించారు. దీంతో శ్రీశైల మల్లన్నకు తొలిసారిగా స్వర్ణం రథం సమకూరినట్లైంది. ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వర్ణ రథం ప్రారంభోత్సవం అనంతరం శ్రీ భ్రమరాంభ సమేత మల్లికార్జునస్వామివారిని రథంపై ఉంచి పుర వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీరెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు, వేద పండితులు, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. *స్వర్ణ రథం విశేషాలు....* 23.6 అడుగుల ఎత్తుతో ఉన్న ఈ స్వర్ణ రథానికి మధ్యలో బంగారు తాపడంతో చేసిన పార్వతీపరమేశ్వరులు, గణపతి, కుమారస్వామి మూర్తులను అత్యంత సుందరంగా కొలువుదీర్చారు. స్వామి, అమ్మవార్ల చుట్టూ అష్ట దిక్పాలకులను తీర్చిదిద్దారు. ముందు భాగంలో స్వారీ చేస్తున్నట్లు ఉండే రెండు పెద్ద అశ్వాలను రూపొందించారు. శివపార్వతుల విగ్రహాలకు ముందు భాగంలో కింద బ్రహ్మ విగ్రహాన్ని రూపొందించారు. దాంతోపాటు స్వర్ణరథంపై ఎనిమిది నందులు, దక్షిణామూర్తి, దుర్గ, వినాయకుడు, లింగోద్భవ శివయ్య రూపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :