Amaravathi Jyothi - Andhra Pradesh / Konaseema : వికసిత్ భారత్ సంకల్పయాత్ర. కడియం, అమరావతి జ్యోతి : కడియం మండలం కడియపులంకలో ఇంచార్జీ సర్పంచ్ పటంసెట్టి రాంజీ అధ్యక్షతన వికసిత్ భారత్ సంకల్పయాత్ర సభా కార్యక్రమం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 20 సంక్షేమ పథకాలు గురించి హాజరైన ప్రజలకు తెలియజేశారు. ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి కౌశల్ యోజన, అమృత్ పథకం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, బేటీ బచావో బేటి పడావో మేకింగ్ ఇండియా, స్వచ్ఛభారత్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి విశ్వ కర్మ యోజన మొదలగు 20 సంక్షేమ పథకాల గురించి వివరించారు. లబ్ధిదారులకు గ్యాస్ స్టౌవ్ లు, ఆయుష్మాన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కడియపులంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. తాసిల్ధార్ ఎం సుజాత, యంఇఒ నాగేశ్వరరావు, బీజెపి నాయకులు ప్రవాస్ యోజన పార్లమెంట్ కన్వీనర్ కురగంట సతీష్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ఎం రజనీ, అసెంబ్లీ కో కన్వీనర్ ఏనాపు ఏసు మండల అధ్యక్షులు నగులపల్లి వీరబాబు జిల్లా ప్రధాన కార్యదర్శి బోరుసు సుబ్రహ్మణ్యం కొటికలపూడి వెంకటేశ్వరరావు చిక్కల శ్రీను కొనగల్ల శ్రీను. వివిధ శాఖల అధికారులు సచివాలయం సిబ్బంది ఆశ వర్కర్స్ గ్రామ వాలంటీర్స్ పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi