Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఇంటూరి నాగేశ్వరరావు. కందుకూరు, అమరావతి జ్యోతి: తుఫాను ప్రభావం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున కందుకూరు నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు కోరారు. అత్యవసరమైతే తప్ప, ప్రయాణాలు వాయిదా వేసుకోండన్నారు. ప్రధానంగా ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లోని తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు, సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లండి. తుఫాను తీవ్రత వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి అండగా నిలబడి, వారికి సహాయ సహకారాలు అందించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేసారు.నియోజకవర్గంలో ఎక్కడైనా, ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ప్రమాదంలో చిక్కుకున్నా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఫోన్ నెంబర్ 7416849333 కు సమాచారం తెలియచేయాలని కోరారు. మేము ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటామని చెప్పారు.
Admin
Amaravathi Jyothi