Friday, 11 September 2026 07:49:37 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

కావలి గడ్డపై టిడిపి జెండా ఎగరవేస్తాం

Date : 08 March 2024 11:59 PM Views : 470

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : *కావలి గడ్డపై టిడిపి జెండా ఎగరేస్తాం*. *బంపర్ మెజార్టీతో కావ్య కృష్ణారెడ్డిని గెలిపించుకుంటాం ..కావలి గడ్డ టీడీపీ అడ్డ*... *పసుపు ???? దళ చైతన్యం-జన ???? 'సేనల' పరాక్రమం* *కలిసి కథన రంగానికి ఉద్యుక్తులౌతున్నకార్య దళాలు* *ముసునూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జనసేన-తెలుగుదేశం సమన్వయ సమావేశం* *ఇంచార్జ్ అళహరి సుధాకర్ నేతృత్వంలో భారీ ర్యాలీగా హాజరైన జనసైనికులు* *సమన్వయ సమావేశంలో ఇరుపార్టీల కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన నియోజకవర్గ అధినాయకత్వం* *భారీ మెజారిటీ లక్ష్యంగా కలిసి ముందుకు సాగాలని పిలుపు* *నవరత్నాల మాటున గత ఐదేళ్లలో జరిగిన ఆరాచకాన్ని, అన్యాయాన్ని ప్రజలకు వివరించాలని పిలుపు* *అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి తెస్తున్న బాబు ష్యురిటీ భవిష్యత్ గ్యారెంటీ ఆరు పథకాలు, ఉపాధి కల్పన లక్ష్యంగా చేయబోయే కార్య క్రమాలు వివరించాలన్న అధినేతలు కావ్యా, అళహరి.* *రానున్నది తెలుగు జన ప్రభుత్వమని ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చే ప్రజా ప్రభుత్వమని అండగా నిలవాలని పిలుపు* *తెలుగుదేశం-జనసేన సమాజానికి రెండు కళ్ళు, కలిసి మెలిసి ముందుకెళ్లాలి* *చంద్రబాబు విజన్ ఫలితమే రామాయ పట్నం, జువ్వలదిన్న, దగదర్తి విమానాశ్రయం, కౌరుకుంట పారిశ్రామిక వాడకు ఏర్పాట్లు* *ప్రతాప్ రెడ్డి కావలికి చేసిందేమిటి?* *కూల్చివేతలు తప్ప నిర్మాణాలు ఏమి చేసారంటూ పైలాన్ కూల్చి వేతను ప్రస్తావన* *ఉత్సవాల పేరుతో దండకాలు చేస్తున్న ఎమ్మెల్యే కులాలు, మాతాల మధ్య తారతమ్యం చూపడం ఏమిటి ?* *విద్యావంతులైన యువతకోసం పట్టణంలో టెక్నికల్ లాబ్ ఏర్పాటు చేస్తా* *కావలి కి రింగ్ రోడ్డు తెస్తా...తేలేకుంటే ఇక రాజకీయాలు చేయను* *చిన్న చిన్న అభిప్రాయభేదాలు ఉంటే పక్కన పెట్టండి, విజయానికి అందరం కృషిచేద్దాం* *అలహరి సుధాకర్ తోపాటు జనసైనికులను సాలువలతో ఘన సత్కారం చేసిన కావ్యా* *కావ్యా గెలుపు తమ ధ్యేయం అంటూ హోరె త్తించిన జన సైనికులు* కావలి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి గారు, జనసేన ఇంచార్జి అలహారి సుధాకర్ గారి అధ్యక్షతన టీడీపీ - జనసేన ఆత్మీయ సమావేశం శుక్రవారం జరిగింది.. కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి గారు మాట్లాడుతూ 2015 లోనే తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగిందని తెలిపారు. రాక్షస పాలన అంత మొందించేందుకు, రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలని, మంచి పరిపాలన అందించడానికి రెండు పార్టీలు ఉమ్మడిగా ముందుకు వెళ్తాయన్నారు. జనసేన నాయకులకు, జనసైనికులకు ధన్యవాదములు తెలిపారు. ఇకపై ఒక కుటుంబంలో అన్నదమ్ముల వలె కలసి తోడుగా నడుద్దామని, కలసి ఎన్నికల ప్రచారం చేద్దామని, కలసికట్టుగా ఉందామని అన్నారు. జనసేన నాయకులు వారి సీట్ త్యాగం చేసి సేవ చేయడానికి ముందుకు వచ్చారని, కాబట్టి జనసేన లోని ప్రతి ఒక్కరినీ గ్రామ స్థాయి నుండి కలుపుకొనిపోవాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరి మన్ననలు పొందే విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఒక్క అవకాశాన్ని ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటానని అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందన్నారు. భయం గుప్పిట్లో ప్రజలు ఉన్నారని అన్నారు. సమస్యలు పరిష్కరించే వాడు ఎమ్మెల్యే కానీ ఆస్తులు దోచుకునేవాడిని ఎమ్మెల్యే అంటారా? అని ప్రశ్నించారు. అమృత్ పధకం పైలాన్ ను మాత్రం కూల్చారని, అమృత్ పధకం పనులు మాత్రం చేపట్టలేదని విమర్శించారు. రాష్ట్రంలో అందరికీ వచ్చే పధకాలు కాకుండా, ఈ పధకం తెచ్చాను, ఈ పని చేశాను అని ఎమ్మెల్యే చెప్పగలరా? అని ప్రశ్నించారు. గెలిచిన వెంటనే విద్యార్థులకు అవసరమైన టెక్నికల్ ల్యాబ్ ఏర్పాటు చేస్తాను అన్నారు. కావలి బైపాస్ ను కలుపుతూ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తాను అన్నారు. అభివృద్ధి చేయని ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కి కావలి ప్రజలు తగిన బుద్ది చెప్పాలన్నారు. జనసేన ఇంచార్జి అలహరి సుధాకర్ గారు మాట్లాడుతూ ఉమ్మడి మ్యానిఫెస్టో తో ముందుకు వెళతామన్నారు. ఈ వైసీపీ పార్టీని తరిమికొట్టడానికి రెండు పార్టీల నాయకులు సమైక్యంగా ముందుకు వెళుతూ ఉమ్మడి అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు బొమ్మి సురేంద్ర, టీడీపీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ, వార్డు నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ జిల్లా, మండల, గ్రామ, వార్డు నాయకులు, జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, బాలకృష్ణ అభిమానులు, టీడీపీ, జనసేన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: