Monday, 27 July 2026 05:37:08 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Date : 10 March 2024 10:20 PM Views : 295

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావలి,అమరావతి జ్యోతి : కావలి పట్టణంలోని హ్యాండ్ లూమ్ కళ్యాణమండపంలో యుటీఎఫ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మహిళా దినోత్సవానికి యుటిఎఫ్ జిల్లా నాయకులు జి.కళ్యాణి అధ్యక్షత వహించగా, కావలి అసెంబ్లీ టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సావిత్రి భాయి చిటపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపాద్యాయులు, ఉద్యోగులు, అంగన్ వాడి, ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కారం చేస్తామని తెలియజేసారు. వైసీపీ అధికారంలోకి రావడం కోసం ఉద్యోగ ఉపాధ్యాయులకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలో వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అయినా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోగా ఉపాధ్యాయ ఉద్యమాన్ని అణిచివేయడం జరిగిందని. అన్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానన్న వాగ్దానం అమలు పరచకపోగా, దుర్మార్గమైన జిపిఎస్ విధానాన్ని అమలుపరచడం జరిగిందని, రాబోయే ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ పునరుద్ధరించాలన్నారు. అలాగే యుటిఎఫ్ 16 సంవత్సరాల పోరాట ఫలితంగా రద్దు కాబడిన అప్రెంటిస్ విధానాన్ని ఈ ప్రభుత్వం మళ్లీ అమల్లోకి తీసుకురావడం దుర్మార్గమని ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. యుటిఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షురాలు కుసుమ కుమారి మాట్లాడుతూ ఈ సంవత్సరం మహిళా దినోత్సవానికి సంబంధించి ఇన్స్పైర్ ఇంక్లూజివ్ అని థీమ్ తో అంతర్జాతీయ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారని, అనగా ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేయాలనేది సారాంశం అన్నారు. సావిత్రిబాయి పూలే వర్ధంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగిందన్నారు. మొట్టమొదటి చైతన్యవంతమైన స్త్రీ సావిత్రిబాయి పూలే అని ఆమె ఎంత మంది స్త్రీలకు చదువు నేర్పి సమాజంలో చైతన్యం చేసిందని తెలియజేశారు. అంతేగాక ఉపాధ్యాయులు గాని మహిళలు గాని కేవలం తమ పిల్లలకు పుస్తకాల్లో ఉండే పాఠ్యాంశాలు కాకుండా సమాజాన్ని అధ్యయనం చేసే దిశగా అడుగులు వేయించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు బాల భవన్ డైరెక్టర్ సుభద్ర దేవి, మహిళా సంఘం నాయకురాలు చాకలికొండ శారద గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి జివి. చలపతి శర్మగారు, యుటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి.రమాదేవి, జిల్లా కార్యదర్షులు బి.మాధవ రావు, కే.భారతి, జిల్లా నాయకులు సిఆర్ఎం లక్ష్మి, ప్రాంతీయ మండలాల మహిళ ఉపాధ్యక్షులు స్వర్ణలత, శ్రీదేవి, సుమతీ దేవి, రాజేశ్వరి, విజయ, ప్రాంతీయ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముఖ్య నాయకులు, మహిళా ఉపాధ్యాయులు, అంగన్వాడి ఉపాధ్యాయులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: