Monday, 20 April 2026 06:58:12 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ఓటమి భయంతో సిట్టింగులను మార్చుతున్న జగన్. బీసీలపై జగన్ రెడ్డి కపట ప్రేమ

Date : 12 December 2023 09:00 PM Views : 208

Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : ఓటమి భయంతో సిట్టింగులను మార్చుతున్న జగన్మోహన్ రెడ్డి బీసీలపై జగన్ రెడ్డి కపట ప్రేమ ఒంగోలు, అమరావతి జ్యోతి: జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని అందుకే అభ్యర్థులను మారుస్తున్నారని ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ పత్రికా ప్రకటన ద్వారా విమర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న వైసీపీ ప్రకటించిన 11 మంది ఇంచార్జుల్లో ఒక్కరూ కూడా గెలిచే పరిస్థితి లేదని, ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి నాయకులను మార్చినంత మాత్రాన జగన్ రెడ్డి తలరాత మారదు అని అన్నారు. వైఎస్సార్‌సీపీ 11 మంది ఇంచార్జుల్లో ముగ్గురు మంత్రులు ఉన్నారని, స్థానికంగా వారిపైన వ్యతిరేఖత, అవినీతి ఆరోపణలు, ప్రజలతో సత్ సంబంధాలు లేకపోవడమే ఇందుకు కారణమని, ప్రజలను మరోసారి మోసం చేసేందుకు వైఎస్సార్‌సీపీ ఇంచార్జుల మార్పుల పేరుతో కొత్త నాటకం ఆడుతోందని తెలిపారు. దగాకోరు జగన్ రెడ్డి పాపం పండిందని జగన్ రెడ్డి అవినీతి, అక్రమాలు పైన ఇప్పటికే ప్రజలు పీకలు దాకా కోపంతో ఉన్నారని అన్నారు.జగన్ రెడ్డి ఇంచార్జులను మారుస్తున్నారు కానీ ఏపీ ప్రజలు ఏకంగా జగన్ రెడ్డినే మార్చేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. ఇప్పటి వరకు వైసీపీ నాయకులు చేసినదంతా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను దోచుకోవడం, వారిని భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేయడం జరిగిందని, మూడు రాజధానుల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నాటకాలు ఆడటం తప్పా ఈ వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసినది ఏమిలేదని అంతా శూన్యమే అని అన్నారు. మంగళగిరిలో గెలుస్తారని తెలిసినప్పుడు సీటు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చి ఓడిపోతారు అని తెలిసినప్పుడు మాత్రం బీసీ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీకి ఇచ్చారని, బీసీల మీద జగన్ రెడ్డికి ఉన్న కపట ప్రేమకు ఇదే నిదర్శనమని అన్నారు. తెలుగుదేశం పార్టీ కల్పిస్తున్న భవిష్యత్తుకు గ్యారెంటీతో వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డిని ప్రజలు చిత్తుగా ఓడించి ఇంటికి పంపడం కూడా గ్యారెంటీ అని ఈ సందర్భంగా తెలియజేశారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :