Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : వలేటివారిపాలెం:మండలంలోని బడేవారిపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులు ఆ పార్టీని వీడి వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ సమక్షంలో వైసిపి కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం ఎంతోకాలంగా కష్టపడి పనిచేస్తే ఇప్పుడు వచ్చిన నాయకత్వం కార్యకర్తలను పట్టించుకోకుండా వారి వ్యక్తిగత స్వార్థంతో నియోజకవర్గంలో పార్టీని సర్వనాశనం చేస్తున్నారు ముఖ్యంగా టిడిపి అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు వ్యక్తిగత పోకడలు,స్వార్థపర రాజకీయాలు, గ్రూపులు కట్టే మనస్తత్వం వల్ల పార్టీకి రాజీనామా చేసి సోమవారం బడుగు బలహీన వర్గాల అభ్యర్థి అందరితో కలివిడిగా ఉండే బుర్రా మధుసూదన్ యాదవ్ సమక్షంలో జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి నచ్చి వైసీపీలో చేరుతున్నాము. వైఎస్ఆర్సిపి అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ గెలుపు కోసం కృషి చేస్తామని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ పార్టీ తల్లి లాంటిదని ప్రతి ఒక్కరిని ఆదరిస్తుందని పార్టీ కోసం అందరూ కలిసి ఐక్యంగా పనిచేసి అధికారంలోకి వస్తే మీకు తగిన గుర్తింపు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగనన్న సన్నిహితుడు విజయసాయిరెడ్డి మనందరికీ అండగా ఉంటారని తెలియజేశారు. తెలుగుదేశం వీడి వైసీపీలోనికి చేరిన వారికి వైసిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఇంటూరి సురేష్, పొడపాటి ప్రేమ్ చంద్,గొట్టిపాటి కొండయ్య,నల్లూరి వెంకటేశ్వర్లు,పొడపాటి విష్ణు, కొల్లూరి రమేష్, కొల్లూరి లక్ష్మీనరసింహ తదితరులు చేరారు. ఈ కార్యక్రమంలోవైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, వలేటివారిపాలెం జడ్పిటిసి సలహాదారులు ఇంటూరి హరిబాబు,సీనియర్ నాయకులు నల్లమోతు చంద్రమౌళి,వైఎస్ఆర్సిపి జిల్లా జనరల్ సెక్రెటరీ ఎర్రమాల నాగభూషణం వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi