Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి,అబద్ధాలు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తా కోర్టు మెట్లు ఎక్కాలిసి వస్తుందని కందుకూరు శాసనసభ్యులు నాగేశ్వరరావు అన్నారు. ఒక రైతు కుటుంబంలో పుట్టి పాతిక సంవత్సరాలు నుంచి వ్యాపారం చేస్తూ ఒక్కోక మెట్టు ఎక్కి ఎమ్మెల్యే అయ్యి ఈ సీటులో కూర్చోవడం జరిగింది…,ఈ పాతికేళ్ల వ్యాపారంలో ఎక్కడా తప్పటడుగులు వేయలేదు, HMDA అంటే తెలియని వాళ్ళు నన్ను విమర్శించడమా?? హైదరాబాద్ లో నా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి జరుగుతున్న ప్రచారాలలో ఏ మాత్రం నిజం లేదు GHMC, HMDA అధికారులు అనుమతులు ఇచ్చిన తరువాతే లేఅవుట్లు వేశాను.., హైదరాబాద్ లోని కృష్ణారెడ్డిపేటలో 2017 లో 27 ఎకరాలు కొనుగోలు చేశానన్నారు. అందులో ఎలాంటి ప్రభుత్వ భూమి లేదని, స్థానిక రెవెన్యూ అధికారులతో పాటు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అధికారులు స్థలాన్ని సర్వే చేసి అనుమతులు ఇచ్చారు. అందుకు సంబంధించిన పత్రాలను కూడా మీడియా సమావేశం సాక్షిగా చూపిస్తున్నా.. నేను ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేసినట్లు అబద్ధపు ప్రచారాలు చేస్తున్న వాళ్లు ఆరోపణ చేసే ముందు ఒక్కసారి వాస్తవాలు తెలుసుకుంటే బాగుండేది. 25 సంవత్సరాల నుంచి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, సుమారు 100 ఎకరాల్లో లే అవుట్లు వేశాను, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వ్యాపారం చేశాను తప్ప ఎక్కడా తప్పుటడుగు వేయలేదు. నిజాయితీ, నిబద్ధతతో ఇన్నాళ్లుగా వ్యాపారం చేస్తూ వస్తున్నా. మరోసారి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిస్తున్నా. ఏదో విధంగా తనకు చెడ్డ పేరు తీసుకురావాలన్న నీచమైన ఆలోచనలు చేస్తే ఊరుకునేది లేదు
Admin
Amaravathi Jyothi