Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : 50 మంది వృద్ధులకు చీరలు,దుప్పట్లు పంపిణీ. గుడ్లూరు: మండలంలోని మూర్తింపేట గ్రామంలో ఎస్టి కాలనీలో 50 మంది వృద్ధులకు చీరలు, దుప్పట్లను పీపుల్ హెల్పింగ్ హాండ్స్ సొసైటీ సంస్థ ప్రెసిడెంట్ తలకాయల ప్రభాకర్ ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూనిరుపేదలకు, ఆర్థికంగా వెనకబడిన వారికి సేవ చేయాలనే ఆశయంతో పీపుల్ హెల్పింగ్ హాండ్స్ సొసైటీ సంస్థను స్థాపించామన్నారు. ఈ సొసైటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. వృద్ధులకు దుప్పట్లో చీరలను కందుకూరి కు చెందిన గోనుగుంట వెంకటేశ్వర్లు సేవా దృక్పథంతో అందజేయడం అభినందనీయమన్నారు. వారికి తమ సొసైటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ట్రెజరర్ హేమలత, మాదేశ్, సంజయ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi