Friday, 17 April 2026 03:21:38 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

టిడిపిలో చేరిన రాయలసీమ జే ఏ సి విద్యార్థి నేతలు

Date : 28 February 2024 05:01 PM Views : 311

Amaravathi Jyothi - Andhra Pradesh / అమరావతి : చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన రాయలసీమ విద్యార్థి జేఏసీ నేతలు అమరావతి, అమరావతి జ్యోతి : రాయలసీమకు చెందిన వివిధ విద్యార్థి సంఘాల నేతలు టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో బుధవారం రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఛైర్మన్ బి.శ్రీనివాసులు, వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి బి.నాగరాజు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి చంద్రబాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జేఏసీ నేతలు మాట్లాడుతూ....జాబ్ కేలండర్ పేరుతో వైసీపీ యువతను మోసం చేసిందని, ఈ ప్రభుత్వంలో యువతకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీకి యువత బుద్ధి చెప్తుందన్నారు. పార్టీలో చేరిన వారిలో సి.రాజు(రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ కో కన్వీనర్), కె.చంద్రశేఖర్(రాయలసీమ యూనివర్సిటీ జేఏసీ కన్వీనర్), జి.లక్ష్మణ్(రాయలసీమ యూనివర్సిటీ జేఏసీ కో కన్వీనర్), పి.వెంకటేష్(ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు), బి.నవీన్ కుమార్(రాయలసీమ విద్యార్థి జేఏసీ), సి.ఏసేపు(ఏపీ నిరుద్యోగుల వేదిక కర్నూలు జిల్లా అధ్యక్షులు), మహబూబ్ బాషా(మైనారిటీ హక్కుల పోరాట సమితి), కె.శ్రీనివాసులు, కె.నవీన్(రాయలసీమ పరిరక్షణ సమితి స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు), బి.మధు(ఏపీ నిరుద్యోగుల వేదిక నాయకలు) తదితరులు చేరారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు కో-ఆర్డినేటర్ గౌరు వెంకటరెడ్డి పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :