Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : తుఫాన్ సందర్భంగా నిరుపేదలకు భోజన ప్యాకెట్లు పంపిణీ కావలి, అమరావతి జ్యోతి: పట్టణంలోని కాలేరుగుంట గిరిజన కాలనీలోని నిరుపేదలకు "ఆపద్భాంధవ సేవా ట్రస్ట్" ఆధ్వర్యంలో సోమవారం భోజనం ప్యాకెట్స్ వితరణ చేశారు. ఆపద్భాంధవ సేవా ట్రస్ట్ చైర్మన్ దామమధుసూదన్ రావు,వారి పెద్ద కుమార్తె గంటా మౌనిక రాణి ,శ్రీకాంత్ కుమార్తె గంటా మోక్షశ్రీ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రతిరోజూ ఒక్కరికి ఐనా అన్నం పెట్టాలి అనే నినాదంతో మొదలుపెట్టిన అన్నం పరబ్రహ్మ స్వరూపం కార్యక్రమంలో భాగంగా ఈరోజు నా మనవరాలు గంటా మోక్షశ్రీ పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదానం చేయుట చాలా సంతోషంగా ఉన్నదని,అదేవిధంగా వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వచ్చి ఈకార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్ట్ సాయికుమార్, ట్రస్ట్ ట్రెజరర్ దామ రాజ్యలక్ష్మి,శారద, దుర్గ,నూరుద్దీన్ కు ట్రస్ట్ వ్యవస్థాపకులు దామ మధుసూదన్ రావు ధన్యవాదాలు తెలిపారు.
Admin
Amaravathi Jyothi