Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే వారిపై చర్యలు ఎస్సై బిబి మహేంధ్ర నాయక్ వలేటి వారిపాలెం అమరావతి జ్యోతి నేషనల్ హైవే పిరమిడ్ వద్ద ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినా, ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోతే నిబంధనల మేరకు జరిమానా విధించడం జరుగుతుందని ఎస్సై బిబిమహేంద్ర నాయక్ అన్నారు. ట్రాఫిక్ నిబంధన పాటించాలని పోలీసులు ఎంత చెప్పినా వాహనదారులు మాత్రం ఆ మాటలు పెడచెవిన పెడుతున్నారని దీంతో రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువ అవుతున్నాయని ఎస్సై తెలిపారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, రాంగ్ రూట్లో వెళ్లడం, హెల్మట్ లేకుండా డ్రైవ్ చేయడం, మద్యం తాగి వాహనాలు నడపడం తదితర నిబంధనలను పాటించని వారిపై ట్రాఫిక్ చలాన్లు విధించడం జరుగుతుందని చెప్పారు.
Admin
Amaravathi Jyothi