Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరిన యువత కావలి అమరావతి జ్యోతి: కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరిన యువత.జగన్ అన్న అభివృద్ధిని కావలి ఎమ్మెల్యే ప్రతాప్ అన్న కార్యదీక్షను చూసి వైసిపిలో చేరిన యువత.కావలి వేపకాయల మిల్లు వద్ద నుండి బైక్ ర్యాలీ గా 500మంది భారీగా యువత ఎమ్మెల్యే నివాసానికి చేరుకొని జై జగనన్న జై ప్రతాప్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.భారీగా వచ్చిన యువతకు కావలి శాసనసభ్యులు సాదరంగా ఆహ్వానించి వైసిపి కండువుల కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఇతర పార్టీల నుండి దొడ్ల విజయ్, తోకల లోకేష్,దాసరి ప్రణీత్,సునీల్ ఆధ్వర్యంలో భారీ ఎత్తులో యువత సమీకరించి కావలి శాసనసభ్యులు సమక్షంలో వైసిపి పార్టీ లో చేరడం జరిగింది అని తెలిపారు.ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ సంస్కారానికి అహంకారానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో యువత ముందుండి నడుం బిగించాలని కోరారు.అరాచక శక్తులను వచ్చె యుద్ధంలో తరిమికొడతానికి యువత సిద్ధంగా ఉండాలని కోరారు.పెత్తందార్ల పక్షాన ఉన్న చంద్రబాబు నాయుడుని, పేదల పక్షాన నిలిచి పోరాడుతున్న జగనన్న కోసం మనమందరం సిద్ధంగా ఉండి యుద్ధం చేసి పెత్తందార్ల కొమ్ముకాస్తున్న బాబును తరిమికొట్టాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువత,కార్య కర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi