Friday, 11 September 2026 07:50:45 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ఘనంగా కమ్మ కార్తీక వనసమారాధన మహోత్సవం

Date : 03 December 2023 07:31 PM Views : 382

Amaravathi Jyothi - Andhra Pradesh / Konaseema : కార్తీక వనసమారాధన మన సంప్రదాయం. -- పెనికేరులో ఘనంగా కమ్మ కార్తీక వనసమారాధన మహోత్సవం. ఆలమూరు, అమరావతి జ్యోతి : ఉసిరిచెట్ల పూజలు, చిన్నారుల ఆట పాటలు, పెద్దలకు సంగీత విభావరి, ఆత్మీయ పలకరింపులు, కష్టనష్టాలు, సుఖసంతోషాలు అను భూతులు వెరసి కేరింతల మధ్య కొత్తపేట నియోజకవర్గ కాకతీయ కమ్మ మహాజన సేవ సంఘం కార్తీకమాస వనసమారాధన ఆదివారం ఆలమూరు మండలం పెనికేరు శ్రీరామ కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో గన్ని రామన్న చౌదరి (విష్ణు) రైస్ మిల్ వద్ద ఘనంగా జరిగింది. కమ్మ కులస్తుల ఆత్మీయానుబంధాలతో పులకించింది. ఉసిరిచెట్ల పూజలు, శివారాధన, పచ్చని చెట్ల కింద షడ్రుచుల సామూహిక భోజనాలు, ఆటపాటలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, కుటుంబ కబుర్లు, సమస్యలు వాటి పరిష్కారాలతో ఒకరోజు కమ్మ కులస్తులంతా చేరి సందడి చేశారు. సామాజిక, ఆధ్యాత్మిక, రాజకీయ, ఐక్యత, సాంస్కృతిక అంశాలకు కమ్మ కార్తీక వనసమారాధన వేదికైంది. చిన్నాపెద్దలు ప్రతిఒక్కరు ఆటపాటలతో సందడి చేశారు. భారీగా కమ్మ కులస్తులు ఉత్సవానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకతీయ కమ్మ మహాజన సంఘం అధ్యక్షులు చుండ్రు గోవిందరాజు, మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు వరప్రకాష్, మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వేగుళ్ల లీలా కృష్ణ, తెలుగుదేశం యువ నాయకులు వంక కుమార్ బాబు, డాక్టర్ గన్ని భాస్కరరావు, మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి, గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జున చౌదరి, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ రెడ్డి ప్రసాద్, మండపేట వైసిపి రైతు విభాగం అధ్యక్షులు రెడ్డి రాధాకృష్ణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకతీయ కమ్మ మహాజన సేవా సంఘం డైరెక్టర్, కొత్తపేట నియోజకవర్గం కమ్మ సంఘం గౌరవ అధ్యక్షులు వంటిపల్లి పాపారావు, అధ్యక్షులు దొడ్డపనేని త్రినాథరావు లు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అలాగే రాజనగరం జిఎస్ఎల్ హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ గన్ని భాస్కర్రావు సౌజన్యంతో ఏర్పాటు చేశారు. ఉచిత వైద్య శిబిరాన్ని వంక కుమార్ బాబు ప్రారంభించారు. అలాగే వంటిపల్లి మురళీకృష్ణ తనయుడు వంటిపల్లి సత్యరామ్ పేద విద్యార్థులకు రెండు మోడరన్ సైకిళ్లను బహుమతిగా అందజేశారు. అదేవిధంగా చిలుకూరి వీర సుబ్బారాయుడు నియోజకవర్గ పరిధి నాలుగు మండలాల్లో ఒక్కొక్కరికి 5000 చొప్పున నలుగురు విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. గుమ్మిలేరు గ్రామానికి చెందిన కోర వీరభద్రరావు ఆదర్శ రైతు, ఆదర్శ గృహిణి, ఇద్దరు విద్యార్థులకు 10,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కమ్మ సంఘం గౌరవ అధ్యక్షులు వంటిపల్లి పాపారావు ప్రతి సంవత్సరం విద్యార్థులకు స్కాలర్షిప్ నిమిత్తం లక్ష రూపాయలను పలువు విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కమ్మ జాతి కీర్తి ప్రతిష్టతలు దేశవ్యాప్తంగా ఉన్నాయని, పూర్వీకులు ఇచ్చిన జాతి ఔన్నత్యాన్ని మరింత పెంచాలన్నారు. ధైర్యం, దయాగుణం, ధార్మికతలో కమ్మ కులస్తులు ముందంజలో ఉన్నార న్నారు. అన్ని రంగాల్లో విజయాలు సొంతం చేసుకుంటున్న కమ్మ కుల స్తుల జైత్రయాత్ర కొనసాగాలన్నారు. అలాగే వివిధ రకాల ఆటల పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. ‌కార్తీకమాస వనసమారాధనకు చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చిన పెనికేరు గ్రామ కమ్మ సోదరులకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, నియోజకవర్గ కమ్మ సంఘం పెద్దలు, యువకులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: