Monday, 20 April 2026 08:22:19 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

నేరాల నియంత్రణకు కట్టడి, అసాంఘిక కార్యకలాపాలకు చెక్ డీఎస్పీ బాల సుబ్రహ్మణ్యం

ఇండో సోల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపిన డిఎస్పి బాలసుబ్రమణ్యం, ఎస్సై వెంకట్రావు

Date : 06 May 2025 05:25 PM Views : 663

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు: నెల్లూరు జిల్లా పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాలు & ట్రాఫిక్, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా, విపత్తు నిర్వహణ మరియు ఇతర పోలీసింగ్ అవసరాల కోసం ఇండో సోల్ కంపెనీ వారు నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ గారి సూచనలతో కందుకూరు డిఎస్పి కార్యాలయంలో డి.ఎస్.పి బాల సుబ్రమణ్యం గారికి అత్యాధునిక సాంకేతికతతో కూడిన DJI Air3s డ్రోన్ కెమెరాను అందచేశారు. నెల్లూరు జిల్లాలో కందుకూరు డివిజన్ పోలీస్ శాఖకు సామాజిక బాధ్యత, సేవా స్పూర్తితో ఒక డ్రోన్‌ను బహుకరించడం అభినందనీయమని డి.ఎస్.పి గారు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ డ్రోన్ ను గుడ్లూరు సర్కిల్ ఆఫీస్ కు డీఎస్పీ గారు అందచేశారు. కందుకూరు డిఎస్పి గారు మాట్లాడుతూ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి నేరాల కట్టడికి చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం నేరాల నియంత్రణలో, శాంతిభద్రతల పరిరక్షణలో మరియు అత్యవసర పరిస్థితుల్లో పోలీసు సిబ్బందికి ఎంతో ఉపయోగపడుతుందని, ఈ డ్రోన్ కెమెరా అధిక రిజల్యూషన్ కలిగిన చిత్రాలు మరియు వీడియోలను తీయగలదని, దీని ద్వారా విస్తృతమైన ప్రాంతాలను నిఘా ఉంచడానికి, నేరస్థలాలను పరిశీలించడానికి మరియు ట్రాఫిక్ ను పర్యవేక్షించడానికి వీలవుతుందన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రాంతాలు, ఇతర నేరాలకు అవకాశం ఉన్న శివారు/నివాసిత ప్రాంతాలు, తోటలు, బహిరంగ ప్రదేశాలను ముందుగానే గుర్తించి అక్కడకు డ్రోన్లను పంపి నిఘా ఏర్పాటుచేశామన్నారు. వీవీఐపీలు, వీఐపీల బందోబస్తుల్లోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాల సాయంతో పర్యవేక్షిస్తున్నామన్నారు. ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణ, సుదూర ప్రాంతాలు ఉన్న వ్యక్తులపై నిఘా పెట్టేందుకు వీటిని వినియోగిస్తున్నట్లు తెలియజేశారు. పోలీసుల సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుందని మరియు తద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందించటానికి దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గుడ్లూరు సర్కిల్ సిఐ మంగ రావు గారు మరియు ఎస్సై వెంకట్రావు ఇండో సోలార్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :