Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : మానసిక దివ్యాంగుల మధ్య పుట్టినరోజు జరుపుకున్న సబ్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక --- దివ్యాంగులకు నాలుగు చెవిటి మిషన్లు, దుప్పట్లు పంపిణీ కందుకూరు,అమరావతి జ్యోతి: కందుకూరు సబ్ కలెక్టర్ ఎస్ ఎస్ శోభిక తన పుట్టినరోజుని కోవూరు రోడ్డు నందు ఉన్న స్వర్ణ స్వయంకృషి మానసిక వికలాంగుల పాఠశాలలో మానసిక వికలాంగుల మధ్య పుట్టినరోజు జరుపుకున్నారు. మానసిక దివ్యాంగులకు తన సొంత నిధులతో నలుగురు దివ్యాంగులకు వినికిడి యంత్రాలను,దుప్పట్లను పంపిణీ చేశారు. మానసిక దివ్యాంగులకు తాను స్వయంగా ఆహారాన్ని వడ్డించారు. అంతకుముందు పాఠశాల కరస్పాండెంట్ సుబ్బారెడ్డి పాఠశాల సిబ్బందితో సబ్ కలెక్టర్ శోభికకు పుష్పగుచ్చం అందజేసి, కేకు కోసిపుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ మానసిక దివ్యాంగుల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం తనకెంతో సంతోషంగా, సంతృప్తిగా ఉందని ఆమె అన్నారు.తనకు శుభాకాంక్షలు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సాక్షమ్ రాష్ట్ర కార్యదర్శి చన్నా రామాంజనేయులు, ఆర్యవైశ్య మీడియా చైర్మన్ చక్కా వెంకట కేశవరావు,గుర్రం ఆల్లురయ్య,మద్దాలి బాబు,ఏవో,సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi