Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : చంద్రబాబు రావాలి... రాష్ట్రం బాగుపడాలి కందుకూరు, అమరావతి జ్యోతి: చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలందరూ బలంగా కోరుకుంటున్నారని కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా, కందుకూరు పట్టణంలోని 31 వ వార్డు సాయి నగర్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఆయన ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచారు. ముందుగా సాయి నగర్ వాసులు నాగేశ్వరావుకి ఘన స్వాగతం పలికారు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా సూపర్ సిక్స్ పథకాల గురించి అవగాహన కల్పించారు. ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈసారి రాబోయేది తెలుగుదేశం - జనసేన కూటమి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు విధానాలు, చేతగాని పరిపాలనను ప్రజలు భరించలేని స్థితికి వచ్చారని అన్నారు. మాయ మాటలు తప్ప ఈ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి లేదని, ప్రజలంతా గత తెలుగుదేశం ప్రభుత్వ పాలన గుర్తుకు తెచ్చుకుని, మరోసారి అలాంటి పాలనే కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. మహిళలు, యువత, రైతులు, అన్ని వర్గాల ప్రజలు మెచ్చేలా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను రూపొందించారని నాగేశ్వరరావు తెలిపారు. ప్రజలకు నరకం చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలన్నదే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల ఉమ్మడి ఆశయమని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి వైసీపీకి ఛాన్స్ ఇవ్వద్దని నాగేశ్వరరావు స్థానికులకు విజ్ఞప్తి చేశారు. కందుకూరు ప్రజలు తనపై చూపిస్తున్న అభిమానాన్ని గుండెల్లో పెట్టుకుంటానని, మీ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయకుండా అభివృద్ధి సంక్షేమ పాలన అందించటానికి రేయింబవళ్లు కష్టపడతానని నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. రాబో ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శ్రీను, వార్డు అధ్యక్షుడు అత్తంటి శివకృష్ణ, చుంచు వేణు, గుమ్మల్ల మాల్యాద్రి, బత్తిన ఆదెమ్మ, రావి సరిత, రావి వీరయ్య, నల్లూరి సూర్యనారాయణ, జమ్మూ వెంకట చైతన్య, నాటకం శంకర్, సవిడిపోయిన వెంకటకృష్ణ, పీలా శ్రీనివాసులు, సవిడిబోయిన సాయి, రావెళ్ల వెంకటేశ్వర్లు, పంది యానాది నాయకులు చిలకపాటి మధుబాబు, షేక్ రఫీ, వడ్డెళ్ళ రవిచంద్ర, గొంది నర్సింగరావు, ముచ్చు వేణు, చుండూరి శ్రీనివాసులు, రావూరి రామకోటయ్య, చుండూరు మాల్యాద్రి, కల్లూరి వెంకటేశ్వర్లు, షేక్ సలాం, షేక్ రూబీ, పులి నాగరాజు, ముప్పవరపు వేణు, షేక్ మమ్ముషా, షేక్ కరిముల్లా మచ్చ మనోహర్, గుమ్మ శివ, ఓరుగంటి రామ్మూర్తి, ఎందేటి సురేష్ గొల్లప్రోలు కొండలు, శేఖర్, బద్దిపూడి శిఖామణి, లింగాబత్తిన మాల్యాద్రి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు...
Admin
Amaravathi Jyothi