Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు: కందుకూరు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి, టిడిపి నాయకురాలు పనబాక లక్ష్మి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోను జనం మెచ్చుకుంటున్నారు. విజనరీ లీడర్ చంద్రబాబు మళ్ళీ సీఎం కావాలన్నది ప్రజల బలమైన ఆకాంక్ష. ప్రజల్లో మార్పు ఉంది. ఈసారి టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవడం ఖాయం. అన్నారు.ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం. ఒక్క రోడ్డు వేయలేదు, ఒక పరిశ్రమ తీసుకురాలేదు. జగన్ అస్తవ్యస్త పరిపాలనతో రాష్ట్రం నాశనమైందన్నారు అదే చంద్రబాబు పాలనలో ప్రజలు ప్రశాంతంగా బతికారు. ఏ వర్గం వారికి, ఏమేమి కావాలో ఆలోచించి రూపకల్పన చేసిన వ్యక్తి చంద్రబాబు . డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి మహిళా సమాజాన్ని ఆర్థికంగా చైతన్య చైతన్యవంతుల్ని చేశారు. ఇంకా చంద్రన్న బీమా, అన్నా క్యాంటీన్, రంజాన్ తోఫా లాంటి ఎన్నో పథకాలు ప్రజలకు మేలు చేశాయన్నారు.జగన్ పాలనకు ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది. రామరాజ్యం స్థాపించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ మంచి నిర్ణయం తీసుకోండి. నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో నెల్లూరు జడ్పీ మాజీ చైర్మన్ పి చెంచలబాబు యాదవ్, పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ముచ్చు శ్రీను, ఉపాధ్యక్షుడు వడ్డేళ్ల రవిచంద్ర, పార్టీ సీనియర్ నాయకులు కండ్రా మాల్యాద్రి, కొమ్మి కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi