Amaravathi Jyothi - Andhra Pradesh / Anakapally : రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలపై చర్యలు తీసుకోవాలి.. కందుకూరు నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ హరిబాబు.. కందుకూరు, అమరావతి జ్యోతి:కందుకూరు పట్టణంలోని బిజెపి కార్యాలయంలో కందుకూరు నియోజకవర్గ బిజెపిఇన్చార్జి హరిబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ నిధులు ఉపయోగించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. పంచాయితీలో వీధిదీపాలు కు కూడా నిధులు లేకుండా ఉన్నాయని ఆయన అన్నారు. కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం 10 కేజీలు బియ్యం అందిస్తుంటే, అది కేవలం 5 కేజీలకే లబ్ధిదారులకు అందుతున్నాయని ఆయన అన్నారు. ఈనెల 21 నుండి రాష్ట్రంలో నీ నియోజకవర్గంలో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగడతామని ఆయన అన్నారు. ఈనెల 22న నెల్లూరులో జరిగే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్ బహిరంగ సభ జయప్రదం చేయాలని ఆయన అన్నారు. కాళహస్తి నడికుడి రైలు మార్గాన్ని స్థల సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనది ఆయన అన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నదని ఆయన అన్నారు.సువిసాలమైన సముద్ర తీరాన్ని ఉపయోగించుకోటంలో విఫలమైనది అని ఆయన అన్నారు..ఈ కార్యక్రమంలో రాఘవులు, ప్రసాదు, భూషయ్య, సురేష్, తదితర బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు...
Admin
Amaravathi Jyothi