Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కమ్మపాలెం రామాలయం వద్ద గణేష్ లడ్డు 2,00,001/రూపాయలకు పాడిన వలేటి మాలకొండయ్య కుటుంబ సభ్యులు గుడ్లూరు చరిత్రలో రికార్డ్ గుడ్లూరు: మండల కేంద్రం గుడ్లూరులో కమ్మపాలెం వద్ద ఉన్న శ్రీ రామాలయం వద్ద ఏర్పాటుచేసిన గణేష్ మండపంలో లడ్డు పాటను 2 లక్షల ఒక రూపాయలకు వలేటి మాలకొండయ్య కుటుంబ సభ్యులు శనివారం సాయంత్రం పాడారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మాలకొండయ్యకు తనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. స్థానికంగా ఉన్న పలు ఆలయాలకు విరాళాలు అందించడంతోపాటు ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. చెమడిదపాడు వద్ద నిర్మాణంలో ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణానికి కూడా మాలకొండయ్య విరాళం అందించారు. రామాలయం వద్ద గణేష్ మండపంలో శనివారం సాయంత్రం జరిగిన లడ్డు వేలం పాటలో మాలకొండయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ పాటలో అధిక మొత్తానికి పాడి గణేష్ ప్రసాదం లడ్డూను 2లక్షల ఒక రూపాయలకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాలకొండయ్య - సుప్రజ దంపతులు, అక్షయ, సన్నీ, మహేష్, నవీన్ కుటుంబ సభ్యులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi