Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : కందుకూరు: కందుకూరు ప్రజల ఇలవేల్పు శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారిని కనుమ పండుగ సందర్భంగా శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు.ముందుగా ఆలయ అధికారులు ఎమ్మెల్యేకు స్వాగతం పలకగా పండితులు వేదమంత్రాల నడుమ ఎమ్మెల్యేను గుడిలోనికి తీసుకువెళ్లారు. కుమారులు అవినాష్, సందీప్, పార్టీ నేతలతో కలిసి అమ్మవారికి ఎమ్మెల్యే నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఉభయ దాతలుగా వ్యవహరించారు. ఆలయానికి వచ్చిన భక్తులతో ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడి సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. కనుమ పండుగ సందర్భంగా ఈ సాయంత్రం ఆలయం వద్ద జరిగే పారువేట ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేయాలని ఈవో కార్తీక్ కు ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో కొడాలి కోటేశ్వరరావు, పిడికిటి వెంకటేశ్వర్లు, మంచిరాజు మురళీమోహన్, మురారిశెట్టి వెంకట సుధీర్, చక్కా కేశవ, గుర్రం అల్లూరయ్య, కోట నరసింహం, కోట కిషోర్, చీదేళ్ల పిచ్చయ్య, చీదెళ్ళ వేణు, కంకణాల వెంకటేశ్వర్లు, వలేటి వెంకటేశ్వర్లు, ముచ్చు వేణు, ముప్పవరపు వేణు నల్లూరి సూరి నారాయణ నల్లూరి సూర్యనారాయణ, శివరామకృష్ణ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi